Kiara Advani Siddharth Wedding To Cost This Much
Kiara Advani: బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఎట్టకేలకు తన ప్రేమికుడు సిద్ధార్థ్ మల్హోత్రాను వివాహం చేసుకోబోతుందని తెలిసినప్పటి నుండీ ఈ జోడీ పెళ్లి గురించే బిటౌన్‌లో ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ జంట వివాహం ఫిబ్రవరి 4, 5, 6వ తేదీల్లో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనుందని ఇప్పటికే అనౌన్స్ చేశారు.
Sidharth Malhotra – Kiara Advani : పెళ్లి పీటలు ఎక్కుతున్న మరో బాలీవుడ్ ప్రేమ జంట..
రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో వీరి వివాహా వేడుక అత్యంత ఘనంగా జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడు రోజుల పాటు మెుహందీ, సంగీత్, పెళ్లి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. బాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్‌తో పాటు దాదాపు 150 మంది వీవీఐపీలు ఈ పెళ్లికి హాజరుకాబోతున్నారట. అతిథుల కోసం లగ్జరీ కార్లు, రాజస్థానీ వంటకాలను భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. కియారా- సిద్ధార్థ్ రాయల్ వెడ్డింగ్‌కు భారీ మొత్తంలో ఖర్చు కానుందని తెలుస్తోంది.
Kiara Advani : కియారా సినిమాలోకి రావడానికి.. ఆ స్టార్ హీరో హెల్ప్ చేసాడట!
మూడు రోజుల ఈ పెళ్లి వేడుకకు ఏకంగా రూ.6 కోట్లకు పైగానే ఖర్చు కానున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ ట్రావెల్స్, ఇతర ఖర్చులు కలిపితే ఈ లెక్క రూ.8 నుంచి రూ.10 కోట్ల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. బిటౌన్‌లో జరిగే రిచెస్ట్ వెడ్డింగ్స్‌లో కియారా-సిద్ధార్థ్‌ల పెళ్లి కూడా ఒకటిగా నిలవనుంది.