KA collections : కిర‌ణ్ అబ్బ‌వ‌రం కెరీర్ బిగ్గెస్ట్ హిట్‌.. వారం రోజుల్లో ‘క’ క‌లెక్ష‌న్స్ ఎంతంటే?

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ‘ క ‘.

Kiaran Abbavaram Ka Movie one week collections

KA collections : టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ‘ క ‘. దీపావ‌ళి కానుక‌గా అక్టోబ‌ర్ 31న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మొద‌టి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. థియేట‌ర్ల‌లో మంచి వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. మూవీకి అనుకున్న రేంజ్ లో స్క్రీన్స్ దొరక్కపోయినప్పటికీ అదే సమయంలో విడుదలైన సినిమాలకి మంచి పోటీ ఇస్తుంది.

విడుద‌లైన వారం రోజుల్లోన్లే ఈ చిత్రం 32.64 కోట్ల‌ను క‌లెక్ట్ చేసింది. ఇందుకు సంబంధించిన పోస్ట‌ర్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. కిర‌ణ్ అబ్బ‌వ‌రం కెరీర్‌లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. కాగా.. కిరణ్ నటించిన తొలి పాన్ ఇండియా సినిమా ఇదే కావ‌డం విశేషం. ఈ సినిమాపై మొద‌టి నుంచి ఎంతో నమ్మకంగా ఉన్న కిరణ్ చెప్పినట్టే సాలీడ్ హిట్ కొట్టాడు.

Sai Durgha Tej : తిరుమలలో సాయి దుర్గా తేజ్.. స్వామీజీలా మారిపోయాడేంటి.. లుక్ వైరల్.. ఆ సినిమా కోసమేనా?

సుజీత్‌ – సందీప్ లు సంయుక్తంగా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. న‌య‌న్ సారిక హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని చింతా గోపాలకృష్ణ నిర్మించారు. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంది.

ఆ మూవీలో పార్ట్ వన్ కి మించిన ట్విస్ట్ లు ఉంటాయ‌ని ఇప్ప‌టికే చిత్ర బృందం తెలిపింది. పార్ట్ 2 ఇంకెలా ఉంటుందోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

Prabhas : యువ రచయితలకు, డైరెక్టర్స్‌కు ప్రభాస్ ఆహ్వానం.. మీ దగ్గర మంచి కథ ఉందా.. అయితే..