KA 2 Movie : కిరణ్ అబ్బవరం ‘క’ సినిమాకు సీక్వెల్ కాదు ప్రీక్వెల్ అంట.. కథ కూడా చెప్పేశారు.. వారంలో అనౌన్స్..

క సినిమాకు సీక్వెల్ కూడా ప్రకటించారు. సినిమా చివర్లోనే క2 టైటిల్ వేసి ప్రేక్షకులని ఆశ్చర్యపరిచారు.

Kiaran Abbavaram KA Movie Sequel Details Announcement Soon

KA 2 Movie : కిరణ్ అబ్బవరం దీపావళికి ‘క’ సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టాడు. సక్సెస్ ఫుల్ గా ఈ సినిమా దూసుకుపోతుంది. కలెక్షన్స్ కూడా అదరగొడుతుంది క సినిమా. ఇప్పటికే క సినిమా 13 కోట్లకు పైగా గ్రాస్ రెండు రోజుల్లోనే కలెక్ట్ చేసింది. దీంతో మూవీ యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అదిరిపోయే స్క్రీన్ ప్లేతో, కొత్త క్లైమాక్స్ తో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది క మూవీ.

అయితే క సినిమాకు సీక్వెల్ కూడా ప్రకటించారు. సినిమా చివర్లోనే క2 టైటిల్ వేసి ప్రేక్షకులని ఆశ్చర్యపరిచారు. కథ అక్కడికి అయిపోయింది కదా దీనికి సీక్వెల్ ఏముంటుంది అని అంతా అనుకుంటున్నారు. అయితే ఇటీవల డైరెక్టర్స్ సుజీత్, సందీప్ మీడియాతో మాట్లాడుతూ.. క సినిమాలో క్రిష్ణగిరి ఊరు గురించి, ఆ ఊళ్ళో అమ్మవారు, ఆ అమ్మవారి అంశతో పుట్టిన ఆడపిల్లలు అని ప్రస్తావించాము. దాని గురించి క2 లో ఉంటుంది. అంటే క సినిమాకు ప్రీక్వెల్ లా ఉంటుంది క2 సినిమా అని అన్నారు. దీంతో క2 ఎప్పుడు వస్తుందో అని ఆసక్తి నెలకొంది.

Also Read : Kiran Abbavaram : కనీసం 5 షోలు అయినా వేయండి.. కిరణ్ అబ్బవరం రిక్వెస్ట్.. వాళ్ళు పట్టించుకోరు అంటూ SKN సంచలన రిప్లై..

తాజాగా నేడు క సక్సెస్ మీట్ లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. క2 ఉంటుంది. వారం రోజుల్లోపే మా డైరెక్టర్స్ క2 సినిమా గురించి అనౌన్స్ చేస్తారు అని తెలిపాడు. దీంతో కిరణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు క2 సినిమా అనౌన్స్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.