Kiran Abbavaram : కనీసం 5 షోలు అయినా వేయండి.. కిరణ్ అబ్బవరం రిక్వెస్ట్.. వాళ్ళు పట్టించుకోరు అంటూ SKN సంచలన రిప్లై..

తమిళ్ సినిమాలకు ఇంత సపోర్ట్ చేస్తున్నా, వాళ్ళ హీరోలను మనం సొంత హీరోలు అనుకుంటున్నా తమిళ్ వాళ్ళు మాత్రం తెలుగు సినిమాలను, హీరోలని ఎంకరేజ్ చేయరు.

Kiran Abbavaram : కనీసం 5 షోలు అయినా వేయండి.. కిరణ్ అబ్బవరం రిక్వెస్ట్.. వాళ్ళు పట్టించుకోరు అంటూ SKN సంచలన రిప్లై..

Kiran Abbavaram Requesting Theaters for KA Movie SKN Reply goes Viral

Updated On : November 2, 2024 / 3:23 PM IST

Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం దీపావళికి ‘క’ సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టాడు. రెండు రోజుల్లోనే ఆల్మోస్ట్ 13 కోట్ల గ్రాస్ వసూలు చేసి కెరీర్ హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టాడు. దీపావళికి ఎక్కువ సినిమాలు ఉండటంతో తెలుగులో మొదట తక్కువ స్క్రీన్స్ ఇచ్చినా ఇప్పుడు హిట్ అవ్వడంతో మళ్ళీ స్క్రీన్స్ పెంచుతున్నారు క సినిమాకు. అయితే తమిళ్, మలయాళంలో మాత్రం వాళ్ళ సినిమాలు ఉన్నాయని వచ్చే వారం రిలీజ్ చేస్తున్నారు.

మనం తమిళ్ సినిమాలకు ఎక్కువ థియేటర్స్ ఇస్తాము. ఒక్కోసారి తెలుగు సినిమాలకు తగ్గించి మరీ తమిళ్ సినిమాలకు థియేటర్స్ ఇస్తున్నారు. ఎప్పట్నుంచో టాలీవుడ్ లో ఈ వివాదం కొనసాగుతుంది. ఫ్యాన్స్, పలువురు ఆడియన్స్ ఈ విషయంలో విమర్శలు కూడా చేస్తున్నారు. అయినా ఇప్పుడు దీపావళికి కూడా మొదట అమరన్, బఘీర సినిమాలకు ఎక్కువ థియేటర్స్ ఇచ్చి క సినిమాకు తక్కువ థియేటర్స్ ఇవ్వడంతో విమర్శలు కూడా వచ్చాయి. మనం తమిళ్ సినిమాలకు ఇంత సపోర్ట్ చేస్తున్నా, వాళ్ళ హీరోలను మనం సొంత హీరోలు అనుకుంటున్నా తమిళ్ వాళ్ళు మాత్రం తెలుగు సినిమాలను, హీరోలని ఎంకరేజ్ చేయరు.

Also Read : Prasanth Varma – Prabhas : ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో ప్రభాస్.. నెగిటివ్ షేడ్స్ లో.. బాలీవుడ్ హీరోతో క్యాన్సిల్ అయిన సినిమా ప్రభాస్‌తో..

ఇప్పుడు క విషయంలో మళ్ళీ అదే జరిగింది. తమిళ్ లో అమరన్ తో పాటు పలు తమిళ్ సినిమాలు ఉన్నాయని క సినిమాని వచ్చే వారం రిలీజ్ చేస్తున్నారు. అయితే కనీసం తెలుగు వర్షన్ కి అయినా చెన్నైలో కొన్ని స్క్రీన్స్ ఇస్తే బాగుంటుందని అక్కడి తెలుగు వాళ్ళు అడుగుతున్నారు. తాజాగా క సినిమా థ్యాంక్స్ మీట్ లో కిరణ్ అబ్బవరం దీని గురించి మాట్లాడారు. కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. కనీసం చెన్నైలో అయినా ఒక్క 5 లేదా పది షోలు ఇప్పించండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. అక్కడ నుంచి తెలుగు వాళ్ళు అడుగుతున్నారు. ఇక్కడ మంచి హిట్ అయింది కనీసం అక్కడ 5 షోలు కూడా వేయించలేకపోతున్నాం. ఈ విషయంలో నేను చాలా బాధపడుతున్నాను అని అన్నారు. దీంతో కిరణ్ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

అయితే కిరణ్ వ్యాఖ్యలను షేర్ చేస్తూ నిర్మాత SKN సంచలన వ్యాఖ్యలు చేసారు. SKN తన ట్విట్టర్లో.. మన తెలుగు ఆడియన్స్, మన ఫిలిం ఇండస్ట్రీ అన్ని భాషల సినిమాలను, హీరోలను మన సొంతం అని ఫీల్ అవుతాము. మనల్ని అలా ఫీల్ అవ్వడం పక్కనపెడితే కనీసం మనల్ని పట్టించుకోరు కూడా. ఇది జీర్ణించుకోడానికి చాలా కష్టం అంటూ ట్వీట్ చేసారు. దీంతో SKN ట్వీట్ వైరల్ గా మారింది. దీంతో పలువురు నెటిజన్లు ఇప్పటికైనా తమిళ్ సినిమాలకు మన దగ్గర ఎక్కువ థియేటర్స్ ఇవ్వడం ఆపాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వివాదంపై ఇంకెవరైనా మాట్లాడతారా చూడాలి.