Prasanth Varma – Prabhas : ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో ప్రభాస్.. నెగిటివ్ షేడ్స్ లో.. బాలీవుడ్ హీరోతో క్యాన్సిల్ అయిన సినిమా ప్రభాస్‌తో..
తాజాగా ప్రభాస్ లిస్ట్ లో మరో సినిమా చేరిందని టాక్ వినిపిస్తుంది.

Prabhas will Join in Prasanth Varma Cinematic Universe for a Movie Rumours goes Viral
Prasanth Varma – Prabhas : ప్రభాస్ ఇప్పుడు భారీ లైనప్ తో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజాసాబ్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. దాని తర్వాత హను రాఘవపూడి సినిమా, స్పిరిట్, కల్కి 2, సలార్ 2.. ఇలా పెద్ద లైనప్ పెట్టుకున్నాడు. అయితే తాజాగా ప్రభాస్ లిస్ట్ లో మరో సినిమా చేరిందని టాక్ వినిపిస్తుంది. ప్రభాస్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు ఓకే చెప్పాడంట.
హనుమాన్ సినిమాతో ఒక్కసారిగా నేషనల్ వైడ్ పాపులర్ అయిన ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ ప్రకటించి అందులో వరుస సినిమాలను ప్రకటిస్తున్నాడు. ఇప్పటికే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి జై హనుమాన్, మహాకాళీ, అధీరా, మోక్షజ్ఞ సినిమా.. ఇలా లైన్ గా సినిమాలు అనౌన్స్ చేసారు. అయితే గతంలో ప్రశాంత్ వర్మ బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ కి ఓ కథ చెప్పి, దాంతో కొన్నాళ్ళు ట్రావెల్ చేసిన సంగతి తెలిసిందే. బ్రహ్మ రాక్షస అనే టైటిల్ తో నెగిటివ్ షేడ్స్ మెయిన్ లీడ్ తో ఉన్న ఆ సినిమా పలు కారణాలతో రణవీర్ సింగ్ తో క్యాన్సిల్ అయింది. ఈ విషయం ప్రశాంత్ వర్మ డైరెక్ట్ గానే చెప్పాడు.
అయితే ఇప్పుడు అదే బ్రహ్మ రాక్షస కథను ప్రశాంత్ వర్మ ప్రభాస్ కి చెప్పినట్టు సమాచారం. ప్రభాస్ కూడా ఎప్పట్నుంచో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయాలని అనుకుంటున్నాడని, అందుకే ప్రశాంతవర్మకు ఓకే చెప్పాడని టాలీవుడ్ లో వినిపిస్తుంది. దీంతో ప్రభాస్ కూడా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ప్రభాస్ – ప్రశాంత్ వర్మ సినిమా ఇద్దరి చేతుల్లో ఉన్న సినిమాలు అన్ని అయ్యాకే ఉంటుందని ఆల్మోస్ట్ 2027 లోనే ఉండొచ్చని అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో కానీ ఒకవేళ ప్రభాస్ నెగిటివ్ షేడ్స్ క్యారెక్టర్ చేసి, అది కూడా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో అయితే ఇక ఆ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.