Mrunal Thakur : మృణాల్‌తో దీపావళి చేసుకున్నట్టు ఫొటో ఎడిట్ చేసిన నెటిజన్.. ఫస్ట్ తిట్టి తర్వాత పొగిడిన మృణాల్ ఠాకూర్..
ఓ ఎడిటర్ మృణాల్ ఠాకూర్ తో తాను దీపావళి చేసుకున్నట్టు ఫొటో ఎడిట్ చేసాడు.

Mrunal Thakur fires on Fake Edit of her on Diwali later praised for that edit
Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం తెలుగు, బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల సెలబ్రిటీల ఫోటోలను ఇష్టమొచ్చినట్టు ఎడిట్ చేసేస్తున్నారు కొంతమంది. ఈ క్రమంలో ఓ ఎడిటర్ మృణాల్ ఠాకూర్ తో తాను దీపావళి చేసుకున్నట్టు ఫొటో ఎడిట్ చేసాడు. ఫ్యామిలీ స్టార్ సినిమాలో మృణాల్ దీపావళి చేసుకుంటున్న ఫొటోని తీసుకొచ్చి తన పక్కనే కూర్చున్నట్టు ఎడిట్ చేసాడు ఓ నెటిజన్.
Also Read : Matka Trailer : వరుణ్ తేజ్ ‘మట్కా’ ట్రైలర్ వచ్చేసింది.. సింహాలను, పులులను ఆడించేవాడు వీడు..
మృణాల్ తో తాను దీపావళి చేస్తున్నట్టు చేసిన ఆ ఎడిట్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది వైరల్ గా మారింది. అయితే మొదట దీనికి మృణాల్ ఠాకూర్.. ఎందుకు ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నావు, నువ్వు చేస్తున్న పని బాగుంది అనుకుంటున్నావా అని ఫైర్ అవుతూ ఆ పోస్ట్ కింద కామెంట్ పెట్టింది. మళ్ళీ ఏమనుకుందో ఏమో ఆ కామెంట్ డిలేట్ చేసింది.
తర్వాత ఆ నెటిజన్ చేసిన ఎడిట్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి.. ఫ్యూచర్ లో నువ్వు పెద్ద సినిమాలను ఎడిట్ చేయాలని కోరుకుంటున్నాను. హ్యాపీ దీవాలి అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ తో పాటు మృణాల్ కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. మొదట తిడుతూ కామెంట్ పెట్టడం ఎందుకు, మళ్ళీ అది డిలీట్ చేసి పొగడటం ఎందుకు అని ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
మృణాల్ ఠాకూర్ ఫోటోని ఎడిట్ చేసిన వ్యక్తికి ఇది కొత్తేమి కాదు. రెగ్యులర్ గా అతను సెలబ్రిటీల పక్కన ఉన్నట్టు, వాళ్ళతో కూర్చున్నట్టు రకరకాలుగా ఎడిట్ చేసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు.