Matka Trailer : వరుణ్ తేజ్ ‘మట్కా’ ట్రైలర్ వచ్చేసింది.. సింహాలను, పులులను ఆడించేవాడు వీడు..

మీరు కూడా మట్కా ట్రైలర్ చూసేయండి..

Matka Trailer : వరుణ్ తేజ్ ‘మట్కా’ ట్రైలర్ వచ్చేసింది.. సింహాలను, పులులను ఆడించేవాడు వీడు..

Varun Tej Matka Movie Trailer Released by Megastar Chiranjeevi

Updated On : November 2, 2024 / 12:11 PM IST

Matka Trailer : జయాపజయాలతో సంబంధం లేకుండా వరుణ్ తేజ్ ఎప్పటికప్పుడు కొత్త కథలతో ప్రయోగాలు చేస్తున్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ ‘మట్కా’ సినిమాతో రాబోతున్నాడు. వైరా ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మట్కా సినిమా నవంబర్ 14న రిలీజ్ కానుంది.

Also Read : KA Movie Collections : అదరగొట్టిన కిరణ్ అబ్బవరం.. ‘క’ సినిమా రెండు రోజుల కలెక్షన్స్ ఎంతో తెలుసా.. కిరణ్ కెరీర్ హైయెస్ట్..

1960 బ్యాక్‌డ్రాప్‌తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా, గ్యాబ్లింగ్ కథాంశంతో మట్కా సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా నవీన్ చెంద్ర, నోరా ఫతేహి, సలోని.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ రిలీజవ్వగా తాజాగా నేడు ట్రైలర్ రిలీజ్ చేసారు. చిరంజీవి చేతుల మీదుగా మట్కా ట్రైలర్ విడుదల చేసారు. మీరు కూడా మట్కా ట్రైలర్ చూసేయండి..

ఇక మట్కా సినిమా పాన్ ఇండియా వైడ్ తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కాబోతుంది.