Pawan Kalyan-Kichcha Sudeep: మలయాళంలో అద్భుత విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను తెలుగులో తెరకెక్కించడానికి ప్రముఖ నిర్మాణసంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రైట్స్ దక్కించుకుంది. ఈ రీమేక్‌లో బాలయ్య, రానా, రవితేజ వంటి పలువురు హీరోల పేర్లు వినిపించాయి కానీ ఎట్టకేలకు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించనున్నట్లు దసరా సందర్భంగా అధికారికంగా ప్రకటించారు.
రానా కేవలం తెలుగు హీరో మాత్రమే కాదు. బాలీవుడ్‌లో వర్సెటైల్ యాక్టర్ కూడా. అందుకే.. ‘బాహుబలి’ లో భల్లాలదేవ లాంటి క్యారెక్టర్ ఇచ్చారు. సినిమాలో నెగటివ్ రోలే అయినా.. సినిమా విజయంలో మాత్రం పాజిటివ్‌గా కీ రోల్ ప్లే చేశాడనే చెప్పాలి.. అయితే పవన్ పక్కన రానా వంటి కుర్ర హీరోని పెడతారా అనే వార్తలు రావడంతో ఆలోచనలో పడ్డ మేకర్స్ పృథ్వీరాజ్ క్యారెక్టర్‌కు ‘కిచ్చా’ సుదీప్‌ని అనుకుంటున్నారట.