Srikanth Kidambi : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని క‌లిసిన బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్.. కాబోయే భార్య‌తో..

మాజీ వరల్డ్ నెంబర్ 1 బ్యాడ్మింటన్ ప్లేయర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కిదాంబి శ్రీకాంత్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని క‌లిశారు.

Kidambi Srikanth met cm revanth reddy to invite for his wedding

Srikanth Kidambi : మాజీ వరల్డ్ నెంబర్ 1 బ్యాడ్మింటన్ ప్లేయర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కిదాంబి శ్రీకాంత్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని క‌లిశారు. త‌న‌కు కాబోయే భార్య శ్రావ్య వ‌ర్మతో క‌లిసి శ్రీకాంత్ జూబ్లిహిల్స్‌లోని ముఖ్య‌మంత్రి నివాసానికి వెళ్లారు. త‌మ‌ పెళ్లికి రావాలంటూ రేవంత్ రెడ్డిని వీరు ఆహ్వానించారు. ఈ మేర‌కు సీఎంకు ఆహ్వాన‌ప‌త్రిక అందించారు.

తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ బ్మాడ్మింట‌న్‌లో అనేక మెడ‌ల్స్ సాధించారు. గ‌తంలో ప్ర‌పంచ నంబ‌ర్ వ‌న్‌గా నిలిచాడు. 2015లో అర్జున అవార్జును ద‌క్కించుకున్నాడు. 2018లో ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారంతో భార‌త ప్ర‌భుత్వం శ్రీకాంత్‌ను స‌త్క‌రించింది.

Smriti Mandhana : చ‌రిత్ర సృష్టించిన స్మృతి మంధాన‌.. భార‌త మ‌హిళా క్రికెట్‌లో ఒకే ఒక ప్లేయ‌ర్‌

ఇక కిదాంబి శ్రీకాంత్ పెళ్లి చేసుకునే శ్రావ్య వర్మ టాలీవుడ్ స్టార్ ఫ్యాషన్ డిజైనర్. ఆమె దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మేనకోడలు. విజయ్ దేవరకొండ, అక్కినేని నాగార్జున, వైష్ణవ్ తేజ్, విక్రమ్ త‌దిత‌రుల‌కు పర్సనల్ స్టైలిస్ట్ గా ప‌నిచేసింది. కీర్తి సురేశ్ న‌టించిన గుడ్ ల‌క్ సఖి చిత్రానికి శ్రావ్య వ‌ర్మ నిర్మాత‌గా వ్య‌వ‌హించారు.

గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న కిదాంబి శ్రీకాంత్, శ్రావ్య వ‌ర్మ ఆగ‌స్టులో నిశ్చితార్థం చేసుకున్నారు.

IND vs NZ : మూడో టెస్టుకు ముందు టీమ్ఇండియా కీల‌క నిర్ణ‌యం.. పిచ్ ఎలా స్పందిస్తుందంటే?