Nagarjuna Akkineni : నాగచైతన్య పెళ్లికి ముందు ఖరీదైన కార్ కొన్న నాగ్.. ఎన్ని కోట్లో తెలుసా..

నాగచైతన్య పెళ్లికి ముందు ఖరీదైన కార్ కొన్న కింగ్ నాగార్జున.

King Nagarjuna bought an expensive car before Naga Chaitanya marriage

Nagarjuna Akkineni : టాలీవుడ్ కింగ్ నాగార్జున కార్ గ్యారేజ్ లో మరో కొత్త కారు చేరింది. టొయోటా లెక్సస్ టాప్ ఎండ్ మోడల్‌ ఖరీదైన కార్ కొన్నారు కింగ్. తన కొత్త కారు రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ లో మెరిశారు నాగ్. ఆ సరికొత్త కార్ చూడడానికి ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఆ కార్ ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. దీంతో ఆ కార్ ధర ఎంతని ఆరా తియ్యడం స్టార్ట్ చేశారు సినీ ఆడియన్స్.

Also Read : Hari Hara Veera Mallu : ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ లో జాయిన్ అయిన పవన్.. లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ మొదలు..

అయితే తాజాగా అందుతన్న సమాచారం మేరకు నాగ్ కొన్న ఈ సరికొత్త ఖరీదైన కార్ విలువ అక్షరాలా 2.5 కోట్లని తెలుస్తుంది. ఇప్పటికే నాగ్ దగ్గర పలు ఖరీదైన కార్లు ఉన్నాయి. అలాగే ఆయన కొడుకు అక్కినేని నాగచైతన్య దగ్గర సైతం కొన్ని వెరైటీ కార్స్ ఉన్నాయి. ఇక ఇప్పుడు నాగ్ మరో కార్ కొనడంతో సినీ అభిమానులు ఈ కార్ ను నాగచైతన్య పెళ్లి స్పెషల్ గా కొన్నారేమో అని అంటున్నారు.


ఇప్పటికే నాగచైతన్య పెళ్లి పనులు స్టార్ట్ చేశారు. తాజాగా నాగచైతన్య, శోభిత మంగళ స్నానాలు కూడా జరిగాయి. వీరి వివాహం డిసెంబర్ 4న గ్రాండ్ గా జరుగనుంది. అలాగే అఖిల్ సైతం ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. తనకి కాబోయే భార్యను కూడా పరిచయం చేసాడు అఖిల్. తన ఇద్దరి కొడుకుల పెళ్లి ముందు నాగ్ కార్ కొనడంతో ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.