#ayyagareno1: కింగ్ కొడుకు పులీ.. సోషల్ మీడియాలో ఫ్యాన్‌ అయ్యగారి హంగామా!

అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూశారో.. ఈ సినిమాపై అఖిల్ ఫ్యాన్ అయ్యగారి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలని కూడా అక్కినేని ఫ్యాన్స్ అంతే..

Most Eligible Bachelor

#ayyagareno1: అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూశారో.. ఈ సినిమాపై అఖిల్ ఫ్యాన్ అయ్యగారి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలని కూడా అక్కినేని ఫ్యాన్స్ అంతే ఎదురుచూశారు. అనుకున్నట్లే అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాపై అయ్యగారి స్పందనకి సోషల్ మీడియా షేక్ అయిపొయింది. అయ్యగారే NO1 అనే హ్యాష్ టాగ్ కూడా ట్రెండింగ్ లో నిలిచింది. అక్కినేని ఫ్యాన్స్ అయ్యగారి రెస్పాన్స్ చూసి ఫుల్ జోష్ మూడ్ లోకి వెళ్లారు.

Most Eligible Bachelor : ఫస్ట్‌డే అయ్యగారు ఎంత వసూలు చేశారంటే

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన అఖిల్ హిట్ రానే వచ్చింది. ఇంట్రెస్టిగ్‌ లవ్‌స్టోరీతో మోస్ట్‌ ఎలిజిబుల్‌ తొలిరోజే హిట్‌ టాక్‌ రావడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నట్లు తెలుస్తోంది. సినిమా రిలీజ్‌ రోజు సోషల్‌ మీడియాలో అఖిల్‌ పేరు కంటే అఖిల్‌ వీరాభిమాని​ అయ్యగారి ఫ్యాన్‌ పేరే ఎక్కువగా వినిపించింది. అయ్యగారే ఎప్పుడు వస్తాడు.. ఎప్పుడు సినిమాపై మాట్లాడతాడనేలా సోషల్ మీడియాలో అక్కినేని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూశారు.

Most Eligible Bachelor: హిట్ కొడతానని అఖిల్ శపథం.. అంత కాన్ఫిడెంట్ ఏంటో!

ఇంతలో అయ్యగారి ఫ్యాన్‌..‘ఓ థియేటర్‌ వద్ద మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ కటౌంట్‌కు కొబ్బరి కాయ కొట్టి ఊగిపోయాడు. సినిమా చూశాక.. వాడే గొప్ప…పులీ..పులీ…కింగ్‌ కొడుకు.. అంటూ కేకలు వేశాడు. అయ్యగారి ఫ్యాన్‌ ఉత్సాహంతో ఇతర అభిమానులు ఈలలు కొట్టి రచ్చ రచ్చ చేశారు. ఇది కాస్త సోషల్‌మీడియాలో హల్చల్ చేయడంతో అక్కినేని ఫ్యాన్స్ మరింతగా రెచ్చిపోయారు. చివరికి #ayyagareno1 అంటూ హ్యాష్‌టాగ్‌ ట్రెండ్‌ అయ్యింది. సోషల్ మీడియాలో మీమ్స్ విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి.