Kiran Abbavaram fire on trolls
Kiran Abbavaram : టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ ‘క ‘. ఈ సినిమా దీపావళి కానుకగా రేపు( గురువారం) విడుదల కానుంది. కిరణ్ అబ్బవరం చేస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. దీంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక రిలీజ్ సమయం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ సైతం గట్టిగానే నిర్వహిస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా నిన్న( మంగళవారం) ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు.
అయితే ఈ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. తనను ట్రోల్స్ చేసే వారిపై మండిపడ్డాడు. నేను చేసే సినిమాలు నచ్చుతాయ్.. కొన్ని పోతాయ్.. అసలు మీ బాదేంటి.. నాతో మీకు ప్రాబ్లమ్ ఏంటి.. ఈ విషయం చెప్తే కచ్చితంగా కొంతమంది నా మీద పగబడతారు. అయినా నేను చెప్తా.. ఎందుకంటే ఆ విషయంలో నేను చాలా ఫీల్ అయ్యా, బాధపడ్డ. ఒక సినిమాలో నా మీద ట్రోల్స్ చేసారు. ఏదో షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ నా పని ఏదో నేను చేసుకుంటున్నా వాళ్లకి ట్రోల్స్ చేయాల్సిన అవసరం ఏంటి..
ఎందుకండి నా మీద.. మిమల్ని నేను ఏం అడుగుతున్నాను. అసలు డైరెక్ట్ గా సినిమాలో ట్రోలింగ్ చెయ్యడం ఏంటి.. అది కూడా నా అనుమతి లేకుండా.. అలా ఎలా చేస్తారండి.. నేను చేసింది 8 సినిమాలు. అందులో 4 డీసెంట్ సినిమాలు. అవి మంచి సక్సెస్ అయ్యాయి. 4 సినిమాలు హిట్ అవ్వడమంటే జోక్ కాదు అంటూ కాస్త ఎమోషనల్ అయ్యారు కిరణ్ అబ్బవరం.