Nishad Yusuf : సినీ పరిశ్రమలో విషాదం.. ‘కంగువా’ ఎడిటర్ కన్నుమూత.. తన సొంత ఇంట్లో శవమై కనిపించిన యూసఫ్
తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది.

Nishad Yusuf editor of Kanguva found dead at his Kochi home
Nishad Yusuf : తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. కోలీవుడ్ సినిమా ఎడిటర్ నిషాద్ యూసఫ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 43 సంవత్సరాలు. కొచ్చిలో నివాసముంటున్న యూసఫ్ బుధవారం తన ఇంట్లో విగతజీవిగా కనిపించారు. ఆయన మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నిషాద్ హఠాన్మరణంతో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. స్టార్ హీరో సూర్య నటించిన కంగువా చిత్రానికి నిషాద్ ఎడిటర్‌గా పని చేశాడు. ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో యూసఫ్ సైతం పాల్గొంటున్నారు.
ఇటీవల చెన్నైలో నిర్వహించిన ఆడియో లాంచ్ కార్యక్రమంలోనూ యూసఫ్ పాల్గొన్నారు. అయితే.. నేటి ఉదయం తన సొంత నివాసంలో విగతజీవిగా కనిపించారు. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఎన్నో బ్లాక్‌బాస్టర్ చిత్రాలకు నిషాద్ ఎడిటర్‌గా పని చేశాడు. తోవినో థామస్ నటించిన ‘తుళ్లుమల’ సినిమాకు ఎడిటర్ గా పలు అవార్డులను అందుకున్నారు. సూర్య, RJ బాలాజీ కాంబోలో వస్తున్న మూవీకి కూడా నిషాద్ ఎడిటర్ గా పని చేస్తున్నాడు.