Rahasya Ghorak : మా ఆయన కోసమైనా ఈ సినిమా చూడండి.. ‘క’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ర‌హ‌స్య కామెంట్స్ వైర‌ల్‌

ఇండస్ట్రీలోకి ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చి హీరోగా ఎదిగాడు కిరణ్ అబ్బవరం.

Rahasya Ghorak : మా ఆయన కోసమైనా ఈ సినిమా చూడండి.. ‘క’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ర‌హ‌స్య కామెంట్స్ వైర‌ల్‌

Rahasya Ghorak Speech in KA Pre Release Event

Updated On : October 29, 2024 / 9:14 PM IST

ఇండస్ట్రీలోకి ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చి హీరోగా ఎదిగాడు కిరణ్ అబ్బవరం. ఆయ‌న న‌టించిన మూవీ ‘క‌’. సుజిత్‌, సందీప్ ద్వ‌యం ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. శ్రీచక్రాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించారు. దీపావ‌ళి కానుక‌గా ఈ చిత్రం ఈ నెల 31న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది.

అందులో భాగంగా తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించారు. మా ఆయ‌న కోసం ఈ సినిమా చూడాలంటూ కిర‌ణ్ అబ్బ‌వ‌రం భార్య రహస్య గోరఖ్ అంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ర‌హ‌స్య మాట్లాడుతూ.. ‘క’ సినిమాను అస‌లు ఎందుకు చూడాలో మూడు కార‌ణాల‌ను చెబుతాను అని అంది.

Chiranjeevi : అక్కినేని వారసులతో ఓ సరదా సాయంత్రం.. సోష‌ల్ మీడియాలో చిరంజీవి పోస్ట్ వైర‌ల్‌

రీజ‌న్ 1 మీ కోసం చూడాలి. ఎంటర్‌టైనర్ కోసమో, ఆఫీసులో బాస్ పెట్టే టెన్ష‌న్ నుంచి రిలీఫ్ కావ‌డానికో చూడండి ఖ‌చ్చితంగా మీ డ‌బ్బులు వ‌సూలు అవుతాయ‌న్నారు. ఇక రీజ‌న్ 2 మా టీమ్ కోసం చూడండి. ఇష్టంతో చేసింది ప్ర‌తిదీ స‌క్సెస్ అవుతుంద‌ని అంటారు. మా టీమ్ ఎంతో మ‌న‌సు పెట్టి ఈ సినిమా చేశారు.

ఇక మూడో రీజ‌న్ మా ఆయ‌న కోసం చూడండి. ఒక సంవ‌త్స‌రాల కాలంగా మీరు ఇచ్చే ఫీడ్ బ్యాడ్‌ను తీసుకుని త‌న‌ని తాను మార్చుకుంటూ క సినిమా కోసం ఇలా చేయాలి, అలా చేయాలి అని ఆలోచించారు. పెళ్లి రోజు త‌ప్ప మిగిలిన అన్ని రోజులు దీని గురించే ఆలోచించారు. కాబట్టి మా కోసం ఈ సినిమా చూడాలి అని అంది.

Kanguva anthem : కంగువా ఆంథ‌మ్ వ‌చ్చేసింది.. గూస్‌బంప్స్ అంతే..