Kanguva anthem : కంగువా ఆంథమ్ వచ్చేసింది.. గూస్‌బంప్స్ అంతే..
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న మూవీ కంగువా.

Suriya Kanguva anthem song out now
Kanguva anthem : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న మూవీ కంగువా. శివ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవల్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. దిశా పటానీ కథనాయిక. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు పది బాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా నవంబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది.
వరుసగా పాటలను విడుదల చేస్తోంది. తాజగా కంగువా ఆంథమ్ సాంగ్ ను విడుదల చేసింది. తలైవానే.. తలైవానే అంటూ ఈ పాట సాగుతోంది. ఇది వింటుంటే గూస్‌బంప్స్ వస్తున్నాయి.