Chiranjeevi : అక్కినేని వారసులతో ఓ సరదా సాయంత్రం.. సోషల్ మీడియాలో చిరంజీవి పోస్ట్ వైరల్
ఈ సంవత్సరం ఏఎన్నార్ నేషనల్ అవార్డుని మెగాస్టార్ చిరంజీవికి అందించారు.

Chiranjeevi instagram post viral with descendants of Akkineni
ఈ సంవత్సరం ఏఎన్నార్ నేషనల్ అవార్డుని మెగాస్టార్ చిరంజీవికి అందించారు. సోమవారం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ వేడుక ఘనంగా నిర్వహించారు. అక్కినేని ఫ్యామిలీ సమక్షంలో అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా చిరంజీవికి ఈ అవార్డును అందించారు. ఈ ఈవెంట్ కు అనేకమంది టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.
తాజాగా నేడు (మంగళవారం అక్టోబర్ 29న) చిరంజీవి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. అక్కినేని నాగార్జునకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆయన స్నేహానికి, నిన్నటి అన్ని అద్భుతమైన క్షణాలకు అని చెబుతూ రెండు ఫోటోలను చిరు పంచుకున్నారు.
Kanguva anthem : కంగువా ఆంథమ్ వచ్చేసింది.. గూస్‌బంప్స్ అంతే..
ఓ ఫోటోలో నాగార్జున, చిరంజీవి ఉండగా.. మరో ఫోటోలో నాగార్జున ఆయన కొడుకులు నాగ చైతన్య, అఖిల్‌లతో పాటు చిరంజీవి, ఆయన కుమారుడు రామ్‌చరణ్ కలిసి ఉన్నారు.
ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. అక్కినేని వారసులతో ఓ సరదా సాయంత్రం అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అటు చిరంజీవి, ఇటు నాగార్జునలతో పాటు వారి వారసులు ఉన్న ఈ ఫోటో ట్రెండింగ్‌లో ఉంది.
View this post on Instagram