Kian Abbavaram : ఇండస్ట్రీలో బతకాలంటే రాజకీయం తెలియాలి.. ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యేసరికి..

ఓ ఇంటర్వ్యూలో కిరణ్ అబ్బవరం తన సినిమా జర్నీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

Kian Abbavaram : ఇండస్ట్రీలో బతకాలంటే రాజకీయం తెలియాలి.. ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యేసరికి..

Kiran Abbavaram Interesting Comments on his Movie Career

Updated On : October 19, 2024 / 9:04 AM IST

Kian Abbavaram : మొదట్లో వరుస హిట్లు కొట్టినా ఆ తర్వాత వరుస పరాజయాలు చూసాడు కిరణ్ అబ్బవరం. కొన్ని వరుస పరాజయాల తర్వాత ఇప్పుడు ఏకంగా భారీ పాన్ ఇండియా సినిమాతో రాబోతున్నాడు. ‘క’ అనే పాన్ ఇండియా సినిమాతో కిరణ్ అబ్బవరం అక్టోబర్ 31న రాబోతున్నాడు. ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో తన సినిమా జర్నీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

Also Read : Salman Khan : 60 మంది సెక్యూరిటీ మధ్య సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ షూట్..

కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో నిలబడాలంటే కొంచెం లౌక్యం ఉండాలి, రాజకీయం ఉండాలి. అవి నాకు ఇంకా రావట్లేదు. నేను మంచి కథలే ఎంచుకున్నా ఎగ్జిక్యూషన్ లో ఎక్కడో తేడా వస్తుంది. మొదటి రెండు సినిమాలు నేను అన్ని చూసుకున్నాను. కానీ ఆ తర్వాత పలు సినిమాలకు నా పాత్ర వరకే చూసుకొని మిగతావి వదిలేసాను అందుకే అవి విజయం సాధించలేకపోయాయి. అందుకే ఇప్పుడు అన్ని చూసుకొని జాగ్రత్తగా ఈ సినిమా చేస్తున్నాను. ఇలా చేయడం వాళ్ళ నేను చాలా ఒత్తిడికి గురవుతున్నాను కానీ తప్పదు సినిమా విజయం కోసం అని తెలిపారు.