KA Movie : ఓటీటీలోకి వచ్చేస్తున్న కిరణ్ అబ్బవరం ‘క’ సినిమా.. ఏ ఓటీటీ? ఎప్పుడు?

తెలుగు రాష్ట్రాల్లో క సినిమా భారీ విజయం సాధించి థియేటర్స్ లో ఏకంగా 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి కిరణ్ కెరీర్లోనే భారీ హిట్ కొట్టింది.

Kiran Abbavaram KA Movie OTT Streaming Details Here

KA Movie : కిరణ్ అబ్బవరం ఇటీవల దీపావళికి ‘క’ సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. కిరణ్ గత కొన్ని సినిమాలు నిరాశపరచగా కొంచెం గ్యాప్ తీసుకొని మరీ క సినిమాతో హిట్ కొడతాను అని చెప్పి హిట్ కొట్టాడు. సస్పెన్స్ థ్రిల్లర్ కథకి ఎవరూ ఊహించని ఓ క్లైమాక్స్ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు క సినిమాతో. తెలుగు రాష్ట్రాల్లో క సినిమా భారీ విజయం సాధించి థియేటర్స్ లో ఏకంగా 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి కిరణ్ కెరీర్లోనే భారీ హిట్ కొట్టింది.

Also Read : Ajay Dhishan : సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న హీరో మేనల్లుడు.. మొదటి సినిమాలోనే మామకు విలన్ గా..

ఇటీవలే మలయాళంలో కూడా రిలీజయి మంచి స్పందన తెచ్చుకుంటుంది క సినిమా. ఇప్పుడు ఈ సూపర్ హిట్ సినిమా ఓటీటీకి రానుంది. కిరణ్ అబ్బవరం క సినిమా ఈటీవీ విన్ ఓటీటీలోకి రానుంది. నవంబర్ 28 నుంచి క సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దీనిపై అధికారిక ప్రకటన కూడా చేసారు. మరి థియేటర్స్ లో మెప్పించిన క సినిమా ఓటీటీలో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. క సినిమా థియేటర్స్ లో మిస్ అయిన వాళ్ళు ఉంటే నవంబర్ 28న ఈటీవీ విన్ ఓటీటీలో చూసేయండి.