Ajay Dhishan : సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న హీరో మేనల్లుడు.. మొదటి సినిమాలోనే మామకు విలన్ గా..

తాజాగా తమిళ్ హీరో మేనల్లుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

Ajay Dhishan : సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న హీరో మేనల్లుడు.. మొదటి సినిమాలోనే మామకు విలన్ గా..

Vijay Antony Nephew Ajay Dhishan Entry in Movies with Gagana Maargan as Villian

Updated On : November 23, 2024 / 5:49 PM IST

Ajay Dhishan – Vijay Antony : సినీ పరిశ్రమలో వారసులు, కుటుంబ సభ్యులు రావడం అనేది మాములు విషయమే. తాజాగా తమిళ్ హీరో విజయ్ ఆంటోని మేనల్లుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. రెగ్యులర్ గా విజయ్ ఆంటోని సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. త్వరలో విజయ్ ఆంటోని గగన మార్గన్ అనే సినిమాతో రాబోతున్నాడు. విజయ్ ఆంటోని హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ గగన మార్గన్ సినిమాతోనే విజయ్ ఆంటోని తన మేనల్లుడు అజయ్ ధీషన్ ని విలన్ గా పరిచయం చేస్తున్నాడు. ఈ సినిమాలో అజయ్ ధీషన్ తన మామ విజయ్ ఆంటోనికి విలన్ గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. లియో జాన్ పాల్ దర్శకత్వంలో విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ నిర్మాణంలో మీరా విజయ్ ఆంటోని ఈ సినిమాని నిర్మిస్తుంది.

Also Read : Miss You Trailer : సిద్ధార్థ్ నెక్స్ట్ సినిమా ‘మిస్ యు’ ట్రైలర్ వచ్చేసింది.. వారంలోనే లవ్వు, లవ్ ఫెయిల్యూర్..

తాజాగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధీషన్‌ను విలన్‌గా పరిచయం చేస్తూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే విజయ్ ఆంటోనీ, అజయ్‌ మధ్య భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండేలా కనిపిస్తోంది.

Vijay Antony Nephew Ajay Dhishan Entry in Movies with Gagana Maargan as Villian