Miss You Trailer : సిద్ధార్థ్ నెక్స్ట్ సినిమా ‘మిస్ యు’ ట్రైలర్ వచ్చేసింది.. వారంలోనే లవ్వు, లవ్ ఫెయిల్యూర్..
ఇప్పటికే మిస్ యు సినిమా నుంచి పాటలు, టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు.

Siddharth Ashika Ranganath Miss You Trailer Released Watch Here
Miss You Trailer : ఒకప్పుడు వరుస సినిమాలు చేసి తెలుగులో కూడా మంచి హిట్స్ కొట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న సిద్దార్థ ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల చిన్నా అనే ఎమోషనల్ సినిమాతో మెప్పించిన సిద్దార్థ ఇప్పుడు మిస్ యు అనే సినిమాతో రాబోతున్నాడు. సిద్దార్థ్, ఆషికా రంగనాథ్ జంటగా 7 మిల్స్ పర్ సెకండ్ బ్యానర్ పై శ్యామ్యూల్ మ్యాథ్యు నిర్మాణంలో రాజశేఖర్ దర్శకత్వంలో ఈ మిస్ యు సినిమా తెరకెక్కుతుంది.
Also Read : Devendra Rajesh Kothe : పవన్ కళ్యాణ్ వల్లే గెలిచాను.. మహారాష్ట్ర ఎమ్మెల్యే కామెంట్స్ వైరల్..
ఇప్పటికే మిస్ యు సినిమా నుంచి పాటలు, టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఒక అమ్మాయితో ప్రేమ, పెళ్లి, విడాకులతో పాటు ఓ రాజకీయ కోణం కూడా ఉన్నటు ఉంది. ఇక ఈ సినిమా నవంబర్ 29న రిలీజ్ కానుంది. మీరు కూడా మిస్ యు ట్రైలర్ చూసేయండి..