Devendra Rajesh Kothe : పవన్ కళ్యాణ్ వల్లే గెలిచాను.. మహారాష్ట్ర ఎమ్మెల్యే కామెంట్స్ వైరల్..

పవన్ కళ్యాణ్ కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి అభ్యర్థుల తరపున పలు ప్రాంతాల్లో ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.

Devendra Rajesh Kothe : పవన్ కళ్యాణ్ వల్లే గెలిచాను.. మహారాష్ట్ర ఎమ్మెల్యే కామెంట్స్ వైరల్..

Solapur BJP Candidate Devendra Rajesh Kothe Praised Pawan Kalyan after Winning Election

Updated On : November 23, 2024 / 8:25 PM IST

Devendra Rajesh Kothe : తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లో NDA కూటమి భారీ విజయం సాధించింది. మన పవన్ కళ్యాణ్ కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి అభ్యర్థుల తరపున పలు ప్రాంతాల్లో ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ప్రచారం చేస్తే జనాలు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో వచ్చినట్టు భారీగా వచ్చారు. పవన్ మహారాష్ట్ర సభల్లో జనం చూసి ఇక్కడి నాయకులు, అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు.

తాజాగా నేడు పవన్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో ఒకటైన షోలాపూర్ లో పవన్ మద్దతు ఇచ్చిన బీజేపీ అభ్యర్థి దేవేంద్ర రాజేష్ కోతే విజయం సాధించాడు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత దేవేంద్ర రాజేష్ కోతే మీడియాతో మాట్లాడుతూ.. నేను పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పవన్ జీ మీ వాళ్లే నేను గెలిచాను. మీ ప్రభావం ఇక్కడ చాలా ఉంది. సోలాపూర్ లో మీరు చేసిన ర్యాలీ నాకు చాలా హెల్ప్ అయ్యింది. రెండు గంటలు మీరు చేసిన రోడ్ షోకి భారీగా జనాలు వచ్చి సపోర్ట్ చేసారు. మీ మాటలతో మహారాష్ట్ర సోలాపూర్ ప్రజలను మీరు ప్రభావితం చేశారు అని తెలిపారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read : దటీజ్ పవన్ కల్యాణ్.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనాని మార్క్..! సంబరాల్లో జన సైనికులు..

పవన్ ఫ్యాన్స్, జనసైనికులు బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్ర రాజేష్ కోతే వ్యాఖ్యలను తెగ వైరల్ చేస్తున్నారు. ఏపీ ఎన్నికల్లో చక్రం తిప్పిన పవన్ ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా NDA విజయానికి కారణమయ్యాడు, దేశవ్యాప్తంగా పవన్ క్రేజ్ మరింత పెరుగుతుందని అంటున్నారు.