దటీజ్ పవన్ కల్యాణ్.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనాని మార్క్..! సంబరాల్లో జన సైనికులు..

మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ మార్క్ కనిపించిందని జనసేన శ్రేణులు సంబరపడిపోతున్నాయి.

దటీజ్ పవన్ కల్యాణ్.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనాని మార్క్..! సంబరాల్లో జన సైనికులు..

Pawan Kalyan (Photo Credit : Google)

Updated On : November 23, 2024 / 4:40 PM IST

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన 5 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా షోలాపూర్, పుణె, డెగ్లూర్, లాతూర్, బల్లార్ పూర్ లో పవన్ కల్యాణ్ ప్రచారం నిర్వహించారు. పవన్ పర్యటించిన పుణె, షోలాపూర్, బల్లార్ పూర్, డెగ్లూర్, లాతూర్ నియోజకవర్గాల్లోని బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. తెలుగు ప్రజలు అధికంగా ఉండే అసెంబ్లీ స్థానాల్లో పవన్ కల్యాణ్ పర్యటించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ మార్క్ కనిపించిందని జనసేన శ్రేణులు సంబరపడిపోతున్నాయి.

మహాయుతికి మద్దతుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మహారాష్ట్రలో విస్తృత్తంగా ఎన్నికల ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో 5 చోట్ల బీజేపీ అభ్యర్థులు లీడ్ లో ఉండటం విశేషం. తెలుగు ప్రజలు అధికంగా ఉండే నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ పర్యటించేలా బీజేపీ శ్రేణులు ప్లాన్ చేశాయి. ఇది వర్కౌట్ అయిందని జనసేన శ్రేణులు సంబరాల్లో మునిగితేలాయి. ఏపీలోనే కాదు మహారాష్ట్ర ఎన్నికల్లోనూ పవన్ కల్యాణ్ మార్క్ కనిపించిందని జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

ఏపీలో ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసింది. స్వయంగా జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రంగంలోకి దిగారు. తెలుగు వారు ఎక్కువగా నివాసం ఉండే ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ ముమ్మరంగా క్యాంపెయిన్ చేశారు. బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు పవన్ కల్యాణ్.

పవన్ కల్యాణ్ ను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా మహాయుతి కూటమికి సపోర్ట్ చేయాలని పవన్ కల్యాణ్ ఓటర్లను అభ్యర్థించారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని పదే పదే తన ప్రసంగాల్లో పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. పవన్ పర్యటించిన ప్రాంతాల్లో ఆయన ఛరిష్మా పని చేసిందని జనసేన శ్రేణులు భావిస్తున్నాయి.

Also Read : మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన కేటీఆర్.. రేవంత్ రెడ్డిపై విమర్శలు ..