మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన కేటీఆర్.. రేవంత్ రెడ్డిపై విమర్శలు ..

మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు.

మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన కేటీఆర్.. రేవంత్ రెడ్డిపై విమర్శలు ..

KTR

Updated On : November 23, 2024 / 2:37 PM IST

KTR : మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. తాజా ఫలితాల ప్రకారం.. మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి మరోసారి అధికార పీఠాన్ని అధిరోహించబోతుంది. ఆ రాష్ట్రంలో 288 అసెంబ్లీ స్థానాలకు గాను 220 స్థానాల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఇండియా కూటమిలో 57 మంది అభ్యర్థులు, 11 మంది ఇతరులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో జేఎంఎం కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. జేఎంఎం కూటమి అభ్యర్థులు 54 స్థానాల్లో విజయం దిశగా పయనిస్తున్నారు. బీజేపీ కూటమి అభ్యర్థులు 26 స్థానాల్లో, ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Also Read: Priyanka Gandhi: వయనాడ్‌లో ప్రియాంక గాంధీ ఘన విజయం.. తొలి ఎన్నికలోనే అన్న మెజార్టీని దాటేసిన చెల్లెలు

మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలు స్పష్టమైన సందేశాన్ని పంపాయని అన్నారు. ప్రాంతీయ పార్టీలు భారతీయ రాజకీయాల భవిష్యత్తు గా ఎప్పటి నుంచో ఉన్నాయి.. కొనసాగుతాయి. కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా అవతరించడంలో మహారాష్ట్రలో విఫలం అయింది. ప్రాంతీయ పార్టీలను నాశనం చేయడంపై కాంగ్రెస్ దృష్టిపెట్టింది. ప్రతీసారి ఇదే పునరావృతం అవుతుందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ అసమర్థత వల్లే బీజేపీ మనుగడ సాధిస్తుందని కేటీఆర్ విమర్శించారు. మహారాష్ట్రలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం, ఆయన సలహాలు, ప్రసంగాలు, బ్యాగులు, హెలికాప్టర్లు కాంగ్రెస్ ను ఘోర వైఫల్యం నుంచి కాపాడలేక పోయాయని కేటీఆర్ ఎద్దేవా చేశారు.