KA Collections : కిరణ్ అబ్బవరం అదరగొట్టాడుగా.. మైండ్ బ్లోయింగ్ ‘క’ కలెక్షన్స్.. పది రోజుల్లో ఎన్ని కోట్లో తెలుసా?

ఇవాళ ఉదయమే మెగాస్టార్ చిరంజీవి కూడా కిరణ్ అబ్బవరం, మూవీ యూనిట్ ను పిలిచి క సినిమా సక్సెస్ అయినందుకు అభినందించారు.

Kiran Abbavaram Ka Movie Ten Days Collections Details Here

KA Collections : కిరణ్ అబ్బవరం ‘క’ సినిమాతో దీపావళికి వచ్చి పెద్ద హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సుజీత్ – సందీప్ దర్శకత్వంలో తెరకెక్కిన క సినిమా సరికొత్త స్క్రీన్ ప్లే తో, ఊహించని క్లైమాక్స్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను మెప్పిస్తుంది. కిరణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

Also Read : Sreeleela – Pushpa 2 : పుష్ప 2 నుంచి శ్రీలీల పోస్టర్ వచ్చేసింది.. ఈసారి ఐటెం సాంగ్‌లో బన్నీతో శ్రీలీల మాస్ డ్యాన్స్ పక్కా..

మొదటి నుంచి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడమే కాక కలెక్షన్స్ తో కూడా అదరగొడుతుంది. ‘క’ సినిమా పది రోజులకు గాను 42.18 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసినట్టు తాజాగా మూవీ యూనిట్ ప్రకటించారు. త్వరలో 50 కోట్లు ఈజీగా దాటేస్తుందని అంతా అంచనా వేస్తున్నారు. ఇక క సినిమా సక్సెస్ పై కిరణ్ కు ఫ్యాన్స్ నుంచే కాక సినీ పరిశ్రమలోని పెద్దల నుంచి కూడా అభినందనలు వస్తున్నాయి.

ఇవాళ ఉదయమే మెగాస్టార్ చిరంజీవి కూడా కిరణ్ అబ్బవరం, మూవీ యూనిట్ ను పిలిచి క సినిమా సక్సెస్ అయినందుకు అభినందించారు. కిరణ్ కొన్ని ఫ్లాప్స్ తర్వాత క సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా ఇప్పట్లో ఓటీటీకి రాదు అని మూవీ యూనిట్ ప్రకటించడంతో కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.