Dilruba : ‘క’ స‌క్సెస్ త‌రువాత కిర‌ణ్ అబ్బ‌వ‌రం ‘దిల్ రుబా’.. రిలీజ్ ఎప్పుడంటే?

టాలీవుడ్ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఇటీవ‌లే క సినిమాతో మంచి స‌క్సెస్ అందుకున్నాడు

Kiran Abbavaram new film title is Dilruba

టాలీవుడ్ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఇటీవ‌లే ‘క’ సినిమాతో మంచి స‌క్సెస్ అందుకున్నాడు. తాజాగా ఆయ‌న కొత్త ద‌ర్శ‌కుడు విశ్వ క‌రుణ్ డైరెక్ష‌న్‌లో ఓ చిత్రంలో న‌టిస్తున్నాడు. “కెఎ10″(KA10) వ‌ర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

ఈ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్, ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ చిత్ర టైటిల్‌ను విడుద‌ల చేశారు. ఈ చిత్రానికి ‘దిల్ రుబా’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ చిత్ర బృందం ఓ స‌రికొత్త పోస్ట‌ర్‌ను పంచుకుంది.

RRR Documentary Release : ‘ఆర్‌ఆర్ఆర్‌’ డాక్యుమెంటరీ కూడా థియేట‌ర్స్‌లో రిలీజ్ చేస్తున్న రాజ‌మౌళి..

ప్రేమ కోసం ఎంత దూరం వెలుతాడు అనే క్యాప్ష‌న్ ఇచ్చిన ఈ పోస్ట‌ర్‌లో కిర‌ణ్ ఓ ఛైర్‌లో కూర్చోని ప‌క్క‌కు చూస్తూ సిగ‌రెట్ తాగుతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఆయ‌న ముందు చాలా మంది నిలుచొని ఉన్నారు.

Sukumar : శ్రీతేజ్ కోసం హ‌స్పిట‌ల్‌కు సుకుమార్‌.. 5 ల‌క్ష‌ల సాయం చేసిన సుకుమార్ భార్య‌..

రుక్సార్ ధిల్లాన్ ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. అంతేకాదండోయ్ ఈ చిత్ర విడుద‌ల తేదీని సైతం ప్ర‌క‌టించారు. 2025 ఫిబ్ర‌వ‌రిలో ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు తెలియ‌జేశారు.