RRR Documentary Release : ‘ఆర్‌ఆర్ఆర్’ డాక్యుమెంటరీ కూడా థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్న రాజమౌళి..
యంగ్ టైగర్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్.

RRR Behind and Beyond Ticket bookings open now
RRR-Behind and Beyond Documentary: యంగ్ టైగర్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. అలియాభట్, ఓలివియా మోరిస్, అజయ్ దేవ్‌గణ్, శ్రియ కీలకపాత్రలు పోషించిన ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించారు. 2022 మార్చి 24 న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు సునామీ సృష్టించింది. రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ చిత్రంలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది.
తాజాగా డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకులను మరోసారి అలరించేందుకు సిద్ధమైంది ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం. ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కడం వెనుక ఎంతో మంది కష్టం ఉంది. దాదాపు మూడేళ్ల పాటు చిత్రీకరణ జరుపుకుంది. షూటింగ్ మొదలు పెట్టిన నాటి నుంచి ఆస్కార్ అందుకునే వరకు జరిగిన ఎన్నో ఆసక్తికర ఘట్టాలతో డాక్యుమెంటరీని రూపొందించారు. ‘ఆర్ఆర్ఆర్- బిహైండ్ అండ్ బియాండ్’ పేరుతో రిలీజ్ కానుంది.
Mohan Babu : మోహన్ బాబు దుబాయ్ పారిపోయాడు.. ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వద్దు.. హైకోర్టులో విచారణ..
డిసెంబర్ 20 నుంచి ఈ డాక్యుమెంటరీని ఎంపిక చేసిన థియేటర్లలో విడుదల చేయనున్నారు. కేవలం మల్టీఫెక్స్ స్ర్కీన్‌లలోనే దీన్ని ప్రదర్శించనున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన టికెట్ల బుకింగ్స్ మొదలు అయ్యాయి.
బుక్ మై షోలో ఈ షోకి సంబంధించిన టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. 1 గంటా 38 నిమిషాల నిడివి గల ఈ డాక్యుమెంటరీలో ఆర్ఆర్ఆర్ గురించి ఇప్పటి వరకు తెలియని విషయాలను చూపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది.
Radhika Apte : బేబీ పుట్టిన తర్వాత బేబీ బంప్ ఫొటోలు షేర్ చేసిన హీరోయిన్ రాధికా ఆప్టే..