Mohan Babu : మోహన్ బాబు దుబాయ్ పారిపోయాడు.. ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వద్దు.. హైకోర్టులో విచారణ..

జర్నలిస్ట్ లపై దాడి కేసులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ కి అప్లై చేయడంతో నేడు హైకోర్టు విచారణ జరిపింది.

Mohan Babu : మోహన్ బాబు దుబాయ్ పారిపోయాడు.. ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వద్దు.. హైకోర్టులో విచారణ..

High Court conducted a hearing on Mohan Babu anticipatory bail in the case of attack on journalists

Updated On : December 19, 2024 / 4:40 PM IST

Mohan Babu : ఇటీవల మంచు మనోజ్ వర్సెస్ మంచు విష్ణు గొడవల నేపథ్యంలో మోహన్ బాబు ఇంటికి జర్నలిస్టులు వెళ్లగా మోహన్ బాబు కోపంగా ఓ జర్నలిస్ట్ పై దాడి చేసాడు. అతనికి తీవ్ర గాయాలవడంతో అతను ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో ఇప్పటికే మోహన్ బాబు పై కేసు నమోదు అయింది. ఇటీవలే మోహన్ బాబు ఆ జర్నలిస్ట్ ని హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించాడు.

జర్నలిస్ట్ లపై దాడి కేసులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ కి అప్లై చేయడంతో నేడు హైకోర్టు విచారణ జరిపింది. జర్నలిస్ట్ తరపున న్యాయవాది వాదిస్తూ.. అటెంప్ట్ టూ మర్డర్ కేస్ పెట్టడంతో హాస్పిటల్ లో ఉన్న జర్నలిస్ట్ ను మోహన్ బాబు కలిశాడు. మోహన్ బాబు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయగల వ్యక్తి, ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వద్దు. అరెస్టు భయంతో మోహన్ బాబు దుబాయి పారిపోయాడు అని అన్నారు.

Also Read : Gautham Krishna : అలా ట్రోల్ చేస్తే అంతకన్నా దౌర్భాగ్యం ఉండదు.. బిగ్ బాస్ రన్నరప్ గౌతమ్ కామెంట్స్..

దీనికి కౌంటర్ గా మోహన్ బాబు తరుపున వాదించిన న్యాయవాది.. మోహన్ బాబు దుబాయ్ పారిపోలేదు. సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా రిలీఫ్ ఇవ్వాలని అని కోరాడు. అయితే మోహన్ బాబు ఇక్కడే ఉన్నాడు అన్న విషయాన్ని అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని, కౌంటర్ దాఖలు చేశాకే తీర్పు ఇస్తామని మోహన్ బాబు అడ్వకేట్ కు హై కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేశారు.