Gautham Krishna : అలా ట్రోల్ చేస్తే అంతకన్నా దౌర్భాగ్యం ఉండదు.. బిగ్ బాస్ రన్నరప్ గౌతమ్ కామెంట్స్..

బిగ్ బాస్ అయ్యాక గౌతమ్ కృష్ణ తాజాగా 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై స్పందించాడు.

Gautham Krishna : అలా ట్రోల్ చేస్తే అంతకన్నా దౌర్భాగ్యం ఉండదు.. బిగ్ బాస్ రన్నరప్ గౌతమ్ కామెంట్స్..

Gautham Krishna gives Clarity on Trolls about his Telugu Speaking

Updated On : December 19, 2024 / 3:49 PM IST

Gautham Krishna : ఇటీవలే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో నటుడు నిఖిల్ మలియక్కల్ విన్నర్ గా నిలవగా గౌతమ్ రన్నరప్ గా నిలిచాడు. అయితే షోలో ఎక్కువమంది కన్నడ నటీనటులను తీసుకోవడంతో వాళ్లంతా కలిసి గ్రూప్ గేమ్ ఆడారని, చివర్లో కూడా నిఖిల్ మా టీవీ నటుడు కాబట్టి అతన్ని గెలిపించారని, తెలుగు వాళ్లకు అన్యాయం చేసారని విమర్శలు వచ్చాయి.

గౌతమ్ కృష్ణ షోలో కొన్నిసార్లు అచ్చ తెలుగు మాట్లాడితే కూడా వేరే కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేసారు. ఇప్పుడు బిగ్ బాస్ అయ్యాక గౌతమ్ కృష్ణ తాజాగా 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై స్పందించాడు.

Also Read : 2024 Tollywood Controversies : 2024లో టాలీవుడ్ ని ఊపేసిన వివాదాలు ఇవే..

గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ.. నాకు తెలుగు భాష పట్ల గౌరవం ఉంది. నాకు తెలియకుండానే నా మాటల్లో స్ట్రాంగ్ తెలుగు పదాలు వచ్చేస్తాయి. అలాంటి పదాలు వాడినప్పుడు మన తెలుగు మనం మాట్లాడొద్దు అంటే అంతకన్నా దౌర్భాగ్యం ఉండదు. నాకు భాషా ప్రావీణ్యం ఉంది కాబట్టి నేను మాట్లాడాను. ఒక తెలుగు వ్యక్తి అయి ఉండి తెలుగు ఎందుకు స్పష్టంగా మాట్లాడుతున్నావు అని ప్రశ్నించడం చాలా పెద్ద తప్పు. కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళ భాష కాకుండా వేరే భాషలు మాట్లాడితే ఒప్పుకోరు. మన తెలుగు సినిమాలు, తెలుగు ఆర్టిస్టులు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. మన భాషని గౌరవించాలి. దాంట్లో తప్పులేదు. కొంతమంది కావాలని చేసి ఉంటారు ఈ ట్రోల్స్. కానీ రెగ్యులర్ తెలుగు వాళ్ళు మాత్రం ఈ ట్రోల్స్ చేసి ఉండరు అని అన్నారు.

అలాగే కావాలని కొంతమంది తెలుగు, కన్నడ అని సపరేట్ చేసి చూశారా మిమ్మల్ని అని ప్రశ్నించగా.. నన్ను అలా చూసి ఉండరు. కొంతమంది కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ ఏమైనా అలా చూసి ఉండొచ్చేమో. ఒకవేళ తెలుగు, కన్నడ చూడాల్సి వస్తే నాతో పాటు హౌస్ లో చాలా మంది తెలుగు కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు కదా అని అన్నారు.