Kiran Abbavaram : ఇంట్రో వీడియోతోనే ఫుల్ గా నవ్వించిన కిరణ్ అబ్బవరం.. కిరణ్ కొత్త సినిమా అనౌన్స్..

హాస్య మూవీస్ బ్యాన‌ర్‌పై కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఓ మూవీలో న‌టిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్‌ను అనౌన్స్ చేశారు.

Kiran Abbavaram new movie title announce

వైవిధ్య‌మైన క‌థ‌ల‌ను ఎన్నుకుంటూ ప్రేక్ష‌కుల‌ను అల‌రించే న‌టుల్లో హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఒక‌రు. ఇటీవ‌లే ఆయ‌న క చిత్రంతో భారీ విజ‌యాన్ని అందుకున్నారు. ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ య‌మా బిజీగా ఉన్నారు. విశ్వ‌క‌రుణ్ ద‌ర్శ‌క‌త్వంలో ఆయ‌న దిల్ రూబా మూవీలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. శివమ్ సెల్యులాయిడ్స్, యాడ్లీ ఫిలిం బ్యానర్స్‌పై రవి, రాకేష్ రెడ్డిలు నిర్మిస్తున్నారు. రుక్సార్ ధిల్లాన్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 14 ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ చిత్రం విడుద‌ల కాక‌ముందే మ‌రో చిత్రాన్ని మొద‌లుపెట్టాడు కిర‌ణ్ అబ్బ‌వ‌రం. హాస్య మూవీస్ బ్యాన‌ర్‌పై ఓ మూవీలో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. కిర‌ణ్ కెరీర్‌లో 11వ మూవీగా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ చిత్ర పూజా కార్య‌క్ర‌మాలు రామానాయుడు స్టూడియోస్‌లో నేడు జ‌రిగాయి.

ఈ చిత్రానికి ‘K-RAMP అనే టైటిల్ ను ఖ‌రారు చేశారు. రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తోంది.