Kiran Abbavaram: ఘనంగా ‘రూల్స్ రంజన్’ మూవీ ప్రారంభం
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించింది కొన్ని సినిమాలే అయినా తన ప్రతిభను చాటుకోవడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు. తనదైన యాక్టింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులను....

Kiran Abbavaram Rules Ranjan Movie Started
Kiran Abbavaram: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించింది కొన్ని సినిమాలే అయినా తన ప్రతిభను చాటుకోవడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు. తనదైన యాక్టింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులను సైతం అబ్బురపరుస్తున్న కిరణ్ అబ్బవరం తాజాగా మరో కొత్త సినిమాను ప్రారంభించాడు. సినీ అతిరధుల సమక్షంలో హీరో కిరణ్ ఆబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా “రూల్స్ రంజన్”చిత్ర ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.
Kiran Abbavaram : పవన్ దెబ్బకి వెనక్కి తగ్గిన మరో యువ హీరో
ప్రముఖ నిర్మాత ఏఎ.రత్నం సమర్పణలో శ్రీసాయి సూర్య మూవీస్, స్టార్‌లైట్ ఏంటర్‌టైన్మెంట్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాను ప్రేక్షకులు మెచ్చే విధంగా తీర్చిదిద్దబోతున్నట్లు చిత్ర రచయిత కమ్ దర్శకుడు రత్నం కృష్ణ వెల్లడించారు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం పాత్ర చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. ఇక ఈ సినిమాలో కిరణ్ అబ్బవరంతో పాటు వెన్నెల కిషోర్, హిమాని, వైశాలి, జయవాణి, ముంతాజ్, సత్య, అన్ను కపూర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
Kiran Abbavaram: సెబాస్టియన్ వీడియో సాంగ్.. నీ మాట వింటే రాదా మైమరపే..!
ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా దర్శకుడు క్రిష్ హాజరై, ఈ సినిమా తొలి ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టారు. ‘రూల్స్ రంజన్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఖచ్చితంగా అంచనాలను క్రియేట్ చేస్తుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉన్నారు. ఇక నేడు పూజా కార్యక్రమాలు జరుపుకున్న రూల్స్ రంజన్ చిత్రం ఈ రోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. మరి రూల్స్ రంజన్ మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.