Ka Movie : ‘ క ‘ మూవీ టికెట్స్ అమ్ముతున్న కిరణ్ అబ్బవరం.. వీడియో చూసారా..

Kiran Abbavaram selling Ka movie tickets

Ka Movie : ‘ క ‘ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ కిరణ్ అబ్బవరం. ఎంతో నమ్మకంతో మొదటి పాన్ ఇండియా హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం తాజాగా AMB సినిమాస్ లో క సినిమా చూడడానికి వచ్చిన ఆడియన్స్ కి టికెట్స్ అమ్మారు. క బ్లాక్ బస్టర్ తర్వాత కిరణ్ అబ్బవరం సంతోషం తో ఇలా టికెట్స్ అమ్మిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.

Also Read : Ka Movie : దంచికొడుతున్న ‘ క ‘ సినిమా మూడురోజుల కలెక్షన్స్.. ఎంతంటే..

ఇక ఆ వీడియో చూసుకుంటే.. AMB సినిమాస్ లో ‘ క’ సినిమా చూడడానికి వచ్చిన ఆడియన్స్ కి టికెట్స్ అమ్ముతూ.. ఫాన్స్ తో సెల్ఫీలు దిగాడు. ఆ తర్వాత థియేటర్ లోపలికి వెళ్లి తన ఫాన్స్ ని కలిసి కాసేపు మాట్లాడుతూ.. చాలా కాలం తరువాత థియేటర్స్ ఇలా ఫుల్ గా ఉండడం చూసి సంతోషంగా ఉంది. ఫ్యామిలీస్ తో వచ్చి సినిమా చేస్తున్నందుకు థ్యాంక్స్.


అందరికీ హ్యాపీ దీపావళి. ‘ క ‘ ను ఇంత పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్స్ అంటూ కిరణ్ అబ్బవరం చెప్పాడు. “క” సినిమాలో తన్వీ రామ్, నయన్ సారిక హీరోయిన్స్‌ గా నటించారు. సుజీత్, సందీప్ ఈ సినిమాను తెరకెక్కించారు. అంతేకాదు క సినిమాకి సీక్వెల్ కూడా ఉందని ప్రకటించారు.