Ka Movie : దంచికొడుతున్న ‘ క ‘ సినిమా మూడురోజుల కలెక్షన్స్.. ఎంతంటే..

Ka Movie : దంచికొడుతున్న ‘ క ‘ సినిమా మూడురోజుల కలెక్షన్స్.. ఎంతంటే..

Kiran Abbavaram Ka movie Three days collections

Updated On : November 3, 2024 / 12:53 PM IST

Ka Movie : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘ క ‘ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దీపావళి కానుకగా 31న గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా లెవెల్ లో వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుండే భారీ వసూళ్లను కూడా అందుకుంది. ‘ క ‘ మూవీకి అనుకున్న రేంజ్ లో స్క్రీన్స్ దొరక్కపోయినప్పటికీ అదే సమయంలో విడుదలైన సినిమాలకి మంచి పోటీ ఇస్తుంది.

Also Read : Lucky Baskhar : లక్కీ భాస్కర్ ప్రభంజనం.. మూడు రోజుల వసూళ్లు ఎంతంటే..

అయితే రిలీజ్ అయిన మొదటి రోజు నుండే సాలిడ్ కలెక్షన్స్ అందుకుంటున్న ఈ సినిమా మూడు రోజుల్లో 19.41 కోట్లు కలెక్ట్ చేసింది. తాజాగా దీనికి సంబందించిన పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. ఇకపోతే కిరణ్ నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. మొదటి నుండే ఈ సినిమాపై నమ్మకంగా ఉన్న కిరణ్ చెప్పినట్టే హిట్ కొట్టాడు.

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ సినిమాకి సుజీత్‌ – సందీప్‌ దర్శకత్వం వహించారు.. చింతా గోపాలకృష్ణ నిర్మించిన ఈ సినిమాలో నయన్ సారిక హీరోయిన్ గా నటించింది. ఇక ‘క’ సినిమాకి సీక్వెల్ కూడా ఉంది. అందులో పార్ట్ వన్ కి మించిన ట్విస్ట్ లు ఉంటాయట. మరి క సినిమానే ఈ రేంజ్ లో ఉందంటే పార్ట్ 2 ఇంకెలా ఉంటుందో చూడాలి.