Lucky Baskhar : లక్కీ భాస్కర్ ప్రభంజనం.. మూడు రోజుల వసూళ్లు ఎంతంటే..

Lucky Baskhar : లక్కీ భాస్కర్ ప్రభంజనం.. మూడు రోజుల వసూళ్లు ఎంతంటే..

Dulquer Salmaan Lucky Baskhar movie Three days collections

Updated On : November 3, 2024 / 12:43 PM IST

Lucky Baskhar : దీపావళి కానుకగా విడుదలైన లక్కీ భాస్కర్ సినిమా మంచి సక్సెస్ సాధించింది. మొదటి రోజు నుండే పాసిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో సైతం దుమ్ము లేపుతుంది. దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చింది.

Also Read : Jyothi Poorvaj : కిల్లర్ గా మారిన గుప్పెడంత మనసు సీరియల్ జగతి మేడం..

ఇప్పటికే విడుదలై మూడు రోజులు పూర్తిచేసుకున్న ఈ సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.26.2 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. తాజాగా మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 39.9 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. మొత్తానికి తెలుగులో లక్కీ భాస్కర్ హవా చూపిస్తుందని చెప్పొచ్చు.

ఇకపోతే కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు దుల్కర్ సల్మాన్. ఈ మలయాళ స్టార్ హీరో ఇప్పటికే నటించిన మహానటి, సీతారామం భారీ హిట్స్ అందుకున్నాయి. ముఖ్యంగా సీతారామం దుల్కర్ కి తెలుగు ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ లభించింది.. మొత్తానికి ఈ సినిమాతో తెలుగులో మరో భారీ హిట్ అందుకున్నారు దుల్కర్.