Jyothi Poorvaj : కిల్లర్ గా మారిన గుప్పెడంత మనసు సీరియల్ జగతి మేడం..

Guppedantha Manasu serial Jyothi Poorvaj killer movie poster
Jyothi Poorvaj : తెలుగు బుల్లితెర నటి జ్యోతి పూర్వజ్ అంటే చాలా మందికి తెలియక పోవచ్చు. కానీ ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌తో తెలుగు ప్రజల్లో ‘జగతి మేడమ్’గా బాగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె పలు సీరియల్స్, సినిమాలు చేస్తూ బాగా పాపులర్ అయ్యింది. అంతేకాదు సోషల్ మీడియాలో నిరంతరం తన హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ హాట్ బ్యూటీ గా కూడా పేరు తెచ్చుకుంది.
Also Read : Pranita Subhash : దీపావళి స్పెషల్.. తెలుపు గాగ్రా చోళీలో అదరగొడుతున్న ప్రణీత..
ఇక ఇటీవల ఆమె ఓ సినిమా ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేసింది. ‘శుక్ర’, ‘మాటరాని మౌనమిది’, ‘ఏ మాస్టర్ పీస్’ వంటి సినిమాలు చేసిన డైరెక్టర్ పూర్వజ్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుంది. అయితే డైరెక్టర్ పూర్వజ్ ఎవరో కాదు జ్యోతి భర్త. ప్రస్తుతం ఈ భార్యా భర్తల కాంబినేషన్ లో వస్తున్న తాజా సినిమా కిల్లర్.
అయితే కిల్లర్ ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అని అనౌన్స్ చేశారు. ‘కిల్లర్’ ఫ్రాంచైజీలో ఇది తొలి సినిమా అని, ఈ సినిమాకు ‘కిల్లర్ పార్ట్ 1 – డ్రీమ్ గర్ల్’ అని టైటిల్ పెట్టారు. తాజాగా దీనికి సంబందించిన మరో పోస్టర్ విడుదల చేశారు టీమ్. ఇక ఇందులో జ్యోతి పూర్వజ్ ఓ అద్దం ముందు ఓ చేతిలో గొడ్డలి, మరో చేతిలో కూరగాయలు పట్టుకొని ఉంది. కానీ అద్దంలో వెనుకవైపు మాత్రం రోబోలా కనిపిస్తునట్టు ఆ పోస్టర్ లో ఉంది. ఈ సినిమాకి సంబందించిన మరిన్ని అప్డేట్స్ తెలియాల్సి ఉంది.