Kirrak Seetha : అయిదేళ్ల ప్రేమ.. పెళ్ళికి ఒప్పించాక వదిలేశాడు.. బ్రేకప్ బాధలో.. హౌస్‌లో ఏడ్చేసిన సీత..

తాజాగా బిగ్ బాస్ లో తన లవ్ బ్రేకప్ గురించి చెప్పింది సీత.

Kirrak Seetha got Emotional While says about her Breakup Story in Bigg Boss House

Kirrak Seetha : బిగ్ బాస్ లో వచ్చే కంటెస్టెంట్స్ తమ జీవితంలో జరిగిన విషాద సంఘటనలు కూడా చెప్పుకొని ఎమోషనల్ అవుతారని తెలిసిందే. ఇటీవల ఓ ఎపిసోడ్ లో కిరాక్ సీత అయిదేళ్ల పాటు ఒక వ్యక్తితో రిలేషన్ లో ఉంటే అతను నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అంటూ ఎమోషనల్ అయింది. తాజాగా ఆ లవ్ బ్రేకప్ గురించి చెప్పింది సీత.

నిన్న ఆదివారం ఎపిసోడ్ లో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని రెండు టీమ్స్ గా విడగొట్టి పలు టాస్కులు ఆడించారు నాగార్జున. ఈ క్రమంలో ఎవరైనా తన బ్రేకప్ బాధ చెప్తే వాళ్లకు ఎక్స్‌ట్రా పాయింట్స్ ఇస్తానని నాగార్జున చెప్పడంతో కిరాక్ సీత వెంటనే తన లవ్ బ్రేకప్ స్టోరీ చెప్పింది.

Also Read : Shekar Basha : నేనే కావాలని అడిగి బయటకు వచ్చేసాను.. శేఖర్ బాషా సంచలన వ్యాఖ్యలు..

కిరాక్ సీత మాట్లాడుతూ.. అయిదేళ్లుగా ఒక అబ్బాయితో ప్రేమలో ఉన్నాను. మా ఇంట్లో మాట్లాడి పెళ్ళికి ఒప్పించిన తర్వాత కూడా నన్ను ఆ అబ్బాయి వదిలేశాడు. అయినా ఆ అబ్బాయి వెనక ఆరు నెలల పాటు తిరిగి ఒప్పించడానికి ట్రై చేశాను. కానీ అతను నన్ను వదిలేశాడు. అతను నాతో రిలేషన్ లో ఉంటూనే ఏడాది నుంచి నన్ను మోసం చేస్తున్నాడని తెలిసింది. అయిదేళ్ల ప్రేమ గతేడాది ఏప్రిల్ లో ముగిసింది. ఆ బ్రేకప్ వల్ల చాలా బాధ పడ్డాను. ఆ సమయంలో ఆల్మోస్ట్ 14 కిలోల బరువు తగ్గాను. బ్రేకప్ బాధ నుంచి బయట పడటానికి సైక్రియాట్రిస్ట్‌ ని కూడా కలిసాను. అప్పుడు బాధపడ్డాను కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే బ్రేకప్ అవ్వడమే మంచిది అనిపిస్తుంది అని చెప్తూ ఎమోషనల్ అయింది. దీంతో కిరాక్ సీత బ్రేకప్ స్టోరీ వైరల్ గా మారింది.