Kirtan Nadagouda
Kirtan Nadagouda : సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఇటీవలే దర్శకుడిగా పరిచయం అవుతూ మొదటి సినిమాని మొదలుపెట్టాడు కీర్తన్ నాదగౌడ. నేడు కీర్తన్ నాదగౌడ నాలుగున్నరేళ్ల కొడుకు సోనార్ష్ లిఫ్ట్ లో ఇరుక్కుపోయి మరణించాడు. దీంతో ఈ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.(Kirtan Nadagouda)
కీర్తన్ నాదగౌడ కన్నడలో అనేక సినిమాలకు దర్శకత్వ శాఖలో పని చేసారు. కెజిఎఫ్ సినిమాకు సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా కూడా పనిచేసారు. ఇటీవలే తెలుగు, కన్నడ భాషల్లో కీర్తన్ నాదగౌడ దర్శకత్వంలో ప్రశాంత్ నీల్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో హారర్ సినిమాని ప్రకటించి పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
Also Read : Jinn Trailer : ‘జిన్’ ట్రైలర్ రిలీజ్.. మరో హారర్ సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే..
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. దర్శకుడిగా మొదటి సినిమా తెరకెక్కుతుంది అనుకునే సంతోష సమయంలో కీర్తన్, సమృద్ధి దంపతుల కుమారుడు సోనార్ష్ కె.నాదగౌడ ఇలా లిఫ్ట్ లో ఇరుక్కొని దుర్మరణం పాలవడంతో విషాదం నెలకొంది. ఈ విషయం తెలిసి పలువురు సినీ ప్రముఖులు ఆ బాబుకు నివాళులు అర్పిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా వీరికి సంతాపం ప్రకటిస్తూ ట్వీట్ చేసారు.
దర్శకుడు శ్రీ కీర్తన్ నాదగౌడ కుమారుడి దుర్మరణం మనస్తాపం కలిగించింది
తెలుగు, కన్నడ భాషల్లో దర్శకుడిగా పరిచయమవుతున్న శ్రీ కీర్తన్ నాదగౌడ కుటుంబంలో చోటు చేసుకున్న విషాదం ఎంతో ఆవేదనకు లోను చేసింది. శ్రీ కీర్తన్, శ్రీమతి సమృద్ధి పటేల్ దంపతుల కుమారుడు చిరంజీవి సోనార్ష్ కె.నాదగౌడ…
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) December 15, 2025