Kissik song from Pushpa 2 out now
ఐకాన్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ పుష్ప 2. రష్మిక కథానాయిక. పుష్ప సినిమాకి సీక్వెల్ గా వస్తుండడంతో ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, గ్లింప్స్, ట్రైలర్, పాటలు సినిమా పై అంచనాలను పెంచేశాయి.
ఈ మూవీలో లీలతో స్పెషల్ సాంగ్ చేసింది. తాజాగా ఈ పాటను చిత్ర బృందం విడుదల చేసింది. కిస్సిక్ అంటూ పాట సాగుతోంది. శ్రీలీల, బన్నీ సూపర్ స్టెప్పులతో అలరించారు.
మైత్రీ మూవీస్ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.