Geetha Singh : కితకితలు హీరోయిన్ కొడుకు మృతి..

కితకితలు సినిమాతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న నటి 'గీతాసింగ్'. కాగా ఆమె పెద్ద కుమారుడు నిన్న (ఫిబ్రవరి 17) రోడ్డు యాక్సిడెంట్ లో మరణించాడు. కానీ ఆమెకు అసలు పెళ్లి కాలేదు..

Geetha Singh son

Geetha Singh : సినీ పరిశ్రమకు ఎంతోమంది వస్తూ ఉంటారు, ఫేడ్ అవుట్ అవుతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ప్రేక్షకులకు గుర్తుండి పోతారు. అలా వెండితెర పై తన అభినయంతో ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి ‘గీతా సింగ్’. ఎవడి గోల వాడిదే సినిమాతో వెండితెరకు పరిచయమైన గీతా సింగ్.. ఆ తరువాత కితకితలు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ ని సంపాదించుకుంది. ఆ సినిమాలో అల్లరి నరేష్ పక్కన హీరోయిన్ గా నటించిన గీతా అందర్నీ అలరించింది.

Sir Movie : తన రికార్డు తానే బ్రేక్ చేయడమే కాదు.. బాలీవుడ్ హీరో కలెక్షన్స్ కూడా బ్రేక్ చేసిన ధనుష్..

ఆ చిత్రం తరువాత వరుస ఆఫర్లు అందుకున్న గీతా సింగ్.. లేడీ కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు 50 పైగా సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆఫర్లు లేకపోవడంతో సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది. కాగా గీతా సింగ్ పెద్ద కుమారుడు నిన్న (ఫిబ్రవరి 17) రోడ్డు యాక్సిడెంట్ లో మరణించాడు. ఈ విషయాన్ని మరో సినీ ఆర్టిస్ట్ కరాటే కల్యాణి తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ‘కారులో అయినా, బైక్ మీద అయినా జాగ్రత్తగా వెళ్ళండి పిల్లలు. కమెడియన్‌ గీతాసింగ్‌ కుమారుడు రోడ్డు యాక్సిడెంట్ లో మరణించాడు’ అంటూ తెలియజేసింది.

ఫిబ్రవరి 17 సాయంత్రం స్నేహితులతో కలిసి కారులో వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆ ప్రమాదంలో గీతాసింగ్ కుమారుడు స్పాట్ లో మరణించినట్లు సమాచారం. ఇక సోషల్ మీడియాలో ఈ వార్త చూసిన నెటిజెన్లు.. గీతాసింగ్ కి తమ సానుభూతిని తెలియజేస్తున్నారు. కాగా గీతా సింగ్ కి అసలు పెళ్లి అవ్వలేదు. ఆ కుమారుడు ఆమె అన్న కొడుకు. గీతా సింగ్ అన్న ఆర్ధిక పరిస్థితి బాగోలేకపోవడంతో, అతని పిల్లలని ఆమె దత్తత తీసుకోని పెంచుకుంటుంది. తనకంటూ ఉన్నదీ ఆ ముగ్గురు పిల్లలే అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.