KMPD THATHA FULL INTERVIEW with Syed Sohel Mr Pregnant movie team
Mr Pregnant : బిగ్‌బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్ (Syed Sohel) నటిస్తున్న తాజా చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్ (Mr Pregnant). ఈ సినిమాని మగవాడు అయిన హీరో ప్రెగ్నెంట్ కావడం అనే ఒక కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నారు. ఆగష్టు 18న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ ని సోహైల్ దగ్గర ఉండి జరిపిస్తున్నాడు. ఈక్రమంలోనే ‘కుర్చీ మడతపెట్టి’ డైలాగ్ తో ఫేమస్ అయిన తాతని సోహైల్ తన సినిమా ప్రమోషన్స్ కోసం ఉపయోగించుకుంటున్నాడు.
Vishwak Sen : పెళ్లి పీటలు ఎక్కబోతున్న విశ్వక్ సేన్.. ఆగష్టు 15న.. పోస్టు వైరల్..!
ఇటీవల సోషల్ మీడియాలో ‘కుర్చీ మడతపెట్టి’ డైలాగ్ బాగా ట్రెండ్ అయ్యింది. ఈమధ్య చిరంజీవి భోళాశంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హైపర్ ఆది స్టేజి పై ఆ డైలాగ్ చెప్పడంతో మరింత ఫేమస్ అయ్యింది. దీంతో ఆ డైలాగ్ చెప్పిన తాత కూడా సెలబ్రిటీ అయ్యిపోయాడు. ఇప్పుడు తాతకి వచ్చిన ఆ ఇమేజ్ నే సోహైల్ తన సినిమా కోసం వాడేసుకుంటున్నాడు. తాతతో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ చేశాడు. ఇక ఈ ఇంటర్వ్యూలో ఆ తాత అమ్మ గురించి, అమ్మతనం గురించి, దేవుడు ఆడపిల్లకు ఇచ్చిన వరం గురించి గొప్పగా మాట్లాడాడు.
Daksha Nagarkar : ఈ ఏడాది ఎంతో ప్రత్యేకం అంటున్న దక్ష.. వారితో పరిచయం.. ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్టు..
“కడుపులో బిడ్డ పడిన దగ్గర నుంచి ఎంతో ప్రేమ పెంచేసుకుంటుంది అమ్మ. ఎంతో నొప్పి భరించి బిడ్డకి జన్మించిన తరువాత ఆ బాధని కూడా తీపిగా భావిస్తుంది. బిడ్డ ఆకలితో ఏడుస్తుంటే, తన ఆకలి పక్కనపెట్టి బిడ్డ ఆకలి చూస్తుంది ముందు. బిడ్డ భవిషత్తు కోసం నాన్న ఎంతైనా సంపాదించని. కానీ అమ్మ మమకారం ముందు ఏది పనికిరాదు. అ అంటే అమృతం, మ అంటే మమకారం. ఆ దేవుడు పుట్టలేక అమ్మని పుట్టించాడు. దేవుడు ఆడపిల్లకు ఇచ్చిన గొప్ప వరం అమ్మతనం. అలాని ఎలాపడితే అలాతిరిగి, సరదాకి ప్రేమించి కడుపు తెచ్చుకొని అమ్మ అవ్వడం కాదు. నాకు నలుగురు పిల్లలు. వారిలో ఒక అబ్బాయికి ఇంకా పిల్లలు లేరు. ఎంతో బాధ అనిపిస్తుంది. పిల్లల్ని కనడం ఒక అద్భుతం. అలాంటి ఒక విషయాన్ని సోహైల్ బాబు చూపించబోతున్నాడు. ఫైట్స్, డాన్స్ లు ఎవరైనా చేస్తారు. కానీ ఇలాంటి సినిమాలు చేయడానికి ధైర్యం ఉండాలి. ఈ సినిమాని ఆదరించండి” అంటూ తాత వ్యాఖ్యానించాడు.