Kollywood producers who gave shocke to YouTube channels
Kollywood : యూట్యూబ్ లో దొరకనిది అంటూ ఏమి లేదు. దేని గురించి సెర్చ్ చేసిన క్షణాల్లో రిజల్ట్ వస్తుంది. అలా యూట్యూబ్ లో చూసి ఎన్నో మంచి పనులు చేస్తున్నవారు, నేర్చుకుంటున్న వారు కొందరైతే, ఇంకొందరు వాటిని పాడు చేసేవారు. ఎన్నో రకాలుగా యూట్యూబ్ లో వీడియోలు చేసుకుంటున్న వారు ఉన్నారు. అందులో మూవీ రివ్యూస్ చేసుకుంటున్న వారి సంఖ్య చెప్పలేం. అన్ని భాషల్లో దాదాపుగా చాలా మంది సినిమా చూసి మొదటి షోకే రివ్యూస్ ఇస్తున్నారు. చాలా మంది ఆ సినిమాలు కార్థమై, అర్ధంకాక చెప్పిన రివ్యూస్ తో కొన్ని సినిమాలపై తీవ్ర నెగిటివ్ ప్రభావం పడుతుంది.
ఆడియన్స్ చాలా వరుకు ముందు ఆ రివ్యూ లను చూసే సినిమా చూడడానికి వస్తున్నారు. అలా రివ్యూస్ నెగిటివ్ గా ఉండడంతో సినిమా చూడకుండా అక్కడే ఆగిపోతున్నారు ఆడియన్స్. దీని తీవ్రత మరింత ఎక్కువవడంతో సినీ ఇండస్ట్రీస్ కి ఇదొక తలనొప్పిగా మారింది. ఇందుకుగాను తమిళ్ ఫిలిం యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ దీనిపై ఒక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశారు.
Also Read : Aishwarya Rajesh : మీనాక్షి పక్కన కూర్చున్నందుకు వెంకటేష్ ని కొట్టి మరీ లేపిన ఐశ్వర్య రాజేష్..
‘‘ఈ ఏడాది విడుదలైన చాలా సినిమాలపై రివ్యూలు ప్రభావం చూపించాయి. ముఖ్యంగా ‘ఇండియన్ 2’, ‘వేట్టయన్’, ‘కంగువా’ ఫలితాలపై పబ్లిక్ టాక్, యూట్యూబ్ ఛానల్స్ ఇచ్చే రివ్యూస్ ఎంతో ఎఫెక్ట్ చూపింది. సినీ ఇండస్ట్రీలో ఇదొక సమస్యగా మారుతోంది. దీనిని ఆపేందుకు పరిశ్రమలోని అన్ని సంఘాలు ఏకం కావాలి. థియేటర్ యజమానులు యూట్యూబ్ ఛానల్స్‌ను సినిమా హాళ్ల ప్రాంగణంలోకి రానివ్వకూడదు. ఫస్ట్ డే.. ఫస్ట్ షో సమయంలో థియేటర్ వద్ద పబ్లిక్ రివ్యూలకు అవకాశం ఇవ్వకూడదు. రివ్యూల పేరుతో నటీనటులు, దర్శక నిర్మాతలపై వ్యక్తిగత విమర్శలను మేము ఖండిస్తున్నాం. ఇకపై అలాంటివాటికి జరిగితే ఊరుకునేదిలేదు’’ అని పేర్కొన్నారు.