Aishwarya Rajesh : మీనాక్షి పక్కన కూర్చున్నందుకు వెంకటేష్ ని కొట్టి మరీ లేపిన ఐశ్వర్య రాజేష్..

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లు గా నటిస్తున్న తాజా సినిమా సంక్రాంతికి వస్తున్నాం.

Aishwarya Rajesh : మీనాక్షి పక్కన కూర్చున్నందుకు వెంకటేష్ ని కొట్టి మరీ లేపిన ఐశ్వర్య రాజేష్..

Aishwarya Rajesh hit Venkatesh for sitting next to Meenakshi Meenakshi Chaudhary

Updated On : November 20, 2024 / 6:36 PM IST

Aishwarya Rajesh : టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లు గా నటిస్తున్న తాజా సినిమా సంక్రాంతికి వస్తున్నాం. దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కోసం సినీ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చే సినిమాలు అంత కామెడీ గా ఉంటాయి కాబట్టి. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని ఇదివరకే చెప్పినప్పటికీ రిలీజ్ డేట్ ఎప్పుడన్నది రివీల్ చెయ్యలేదు.

తాజాగా నేడు ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఇక ఈ ఈవెంట్ కి చిత్ర బృందం మొత్తం వచ్చారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాను జనవరి 14 న రిలీజ్ చేస్తునట్టు ప్రకటించారు. ఇక ఇప్పటికే సంక్రాంతి బరిలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం కూడా ఈ లిస్టులోకి చేరింది.

Also Read : Mohini Dey : రెహమాన్ విడాకులిచ్చిన కొన్ని గంటలకే.. ఆ లేడీ మ్యూజిషియన్ కూడా విడాకుల ప్రకటన..

అయితే ఈ ఈవెంట్ లో ఐశ్వర్య రాజేష్ చేసిన ఓ పని షాకింగ్ గా ఉంది. అదేంటంటే.. ఈ ఈవెంట్ కి వచ్చిన హీరో హీరోయిన్స్ అందరూ సినిమాలోని తమ క్యారెక్టర్స్ తో వచ్చారు. వెంకటేష్ అలాగే ఐశ్వర్య రాజేష్ ఇద్దరూ భార్య భర్తలుగా స్టేజ్ పై కూర్చున్నారు. పోలీస్ యూనిఫామ్ లో వెంకటేష్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పాత్రలో మీనాక్షి స్టేజ్ పైకి వచ్చింది. మీనాక్షి, ఐశ్వర్య మధ్యలో వెంకీ మామ కూర్చున్నాడు. అనంతరం వెంకటేష్ తన భార్య పక్కనుండగానే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన మీనాక్షితో క్లోజ్ గా మాట్లాడతాడు. అది తట్టులేకపోయిన ఐశ్వర్య వెంకటేష్ భుజం పై రెండు సార్లు గట్టిగా కొట్టి అక్కడి నుండి లేపింది. లేపి వాళ్ళ ఇద్దరి మధ్యలో కూర్చుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓవరాల్ గా ఎలా ఉంటుందో చిన్న శాంపిల్ చూపించారు టీమ్. ఇదంతా స్టేజ్ ఫై సరదాగా జరిగినప్పటికీ వెంకటేష్ ను ఐశ్వర్య కొట్టిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. చివరిగా వెంకటేష్ మాట్లాడుతూ.. సంక్రాంతికి వస్తున్నాం.. ఇది శాంపిల్ మాత్రమే.. సినిమాలో ఇంకా ఉంటుంది.. దిల్ రాజు గారికి సంక్రాంతికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇస్తున్నాం అంటూ చెప్పారు.