Mohini Dey : రెహమాన్ విడాకులిచ్చిన కొన్ని గంటలకే.. ఆ లేడీ మ్యూజిషియన్ కూడా విడాకుల ప్రకటన..
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విజేత AR రెహమాన్ దంపతులు విడాకులు ప్రకటించిన సంగతి తెలిసిందే.

A few hours after AR Rahman divorce his lady assistant Mohini Dey also announced the divorce
Mohini Dey : ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విజేత AR రెహమాన్ దంపతులు విడాకులు ప్రకటించిన సంగతి తెలిసిందే. 30 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికారు. తన భార్య సైర బాను తో విడాకుల అనంతరం ఈ విషయం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ దంపతులు విడాకులు తీసుకున్నట్టు తెలుస్తుంది.
Also Read : Mahesh Babu-Satyadev : అన్నదమ్ములుగా మహేష్ బాబు, సత్యదేవ్.. ఆ సినిమాకి వాయిస్..!
అయితే ఊహించని విధంగా రెహమాన్ విడాకులు ప్రకటించిన కొద్ది గంటల వ్యవధిలోనే ఆయన మ్యూజిక్ అసిస్టెంట్ మోహిని డే సైతం తన భర్తకి విడాకులు ఇచ్చి సపరేట్ అయినట్టు తెలిపింది. ఇక ఈ విషయాన్ని తెలుపుతూ తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ సైతం షేర్ చేసింది. ” మార్క్ ఇంకా నేను సపరేట్ అవ్వడానికి నిర్ణయించుకున్నాం. మా ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ అందరి ఇష్టపూర్వకంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇద్దరి అంగీకారంతో సపరేట్ అయినప్పటికీ పలు ప్రాజెక్ట్స్ కి మేము ఇద్దరం కలిసి పని చేస్తున్నాం” అని ఆమె ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. ఇక మోహిని డే రెహమాన్ దగ్గర మ్యూజిక్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నారు. వోకలిస్ట్ గా, అలాగే ప్రైవేట్ సాంగ్స్ కూడా చేస్తుంటుంది.
View this post on Instagram
అయితే రెహమాన్ విడాకుల వేళ తన అసిస్టెంట్ సైతం విడాకులు ప్రకటించడంతో ఈ విషయం నెట్టింట పెద్ద దుమారమే రేపుతోంది. అసలు రెహమాన్ విడాకులు ఇచ్చిన వెంటనే ఆయన అసిస్టెంట్ కూడా విడాకులు ఇవ్వడమేంటి..? రెహమాన్ విడాకుల వెనక ఆయన అసిస్టెంట్ మోహిని డే హస్తమేమైనా ఉందా.. ఆమె వల్లనే రెహమాన్ విడాకులు తీసుకున్నారా అన్న కోణంలో చాలా మంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒకేసారి వీరిద్దరూ విడాకులు ఎందుకు తీసుకున్నారన్నది తెలియాల్సి ఉంది.