kona venkat says he used to sell ganja during my college days
Kona Venkat : టాలీవుడ్ ప్రముఖ స్క్రీన్ రైటర్ కోన వెంకట్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రైటర్ గా దూకుడు, జై లవకుశ, నిన్ను కోరి, కింగ్, బలుపు వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు పని చేశాడు. ముఖ్యంగా దర్శకుడు శ్రీను వైట్ల, కోన వెంకట్ ది హిట్టు కాంబినేషన్. వీరిద్దరి కలయికలో సినిమా అంటే ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. రైటర్ గానే కాదు నిర్మాతగా గీతాంజలి, నిన్ను కోరి వంటి మరికొన్ని సినిమాలను కూడా నిర్మించాడు. ప్రస్తుతం కోన వెంకట్, దర్శకుడు బాబీ సినిమాలకు ఆస్థాన రైటర్ గా మారిపోయాడు.
Waltair Veerayya: వాల్తేరు వీరయ్య ట్రైలర్.. వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్!
బాబీ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఈ మూవీకి కోన స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ అందిస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోన వెంకట్ తన జీవితంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ని గుర్తు చేసుకున్నాడు. తాను కాలేజీ చదువుతున్న రోజుల్లో గంజాయి స్మగ్లింగ్ చేసినట్లు తెలిపాడు.
“నా స్నేహితుడు ఒకడు ఆర్ధిక ఇబ్బందులు నుంచి తప్పించుకోడానికి గంజాయి పడ్డించాడు. దానిని అమ్మే ప్రయత్నంలో పోలీసులకు పట్టుబడ్డాడు. పోలిసుల నుంచి బయటకి వచ్చిన తరువాత, ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. వాడు చావుబతుకుల్లో ఉన్న సమయంలో మాకు విషయం తెలిసింది. వాడి అప్పులు ఎలాగైనా తీర్చాలని నిర్ణయం తీసుకోని, మేము గంజాయి అమ్మడానికి గోవా బయలుదేరాం.
మా నాన్న డీఎస్పీ కావడంతో ఆయన కారు వేసుకొని వెళ్ళాము. పక్కాగా ప్లాన్ చేసుకొని మహబూబ్ నగర్, కర్ణాటక, గోవా బోర్డర్ లు దాటించి గంజాయి అమ్మి డబ్బులు తీసుకు వచ్చాము. వాటితో మా ఫ్రెండ్ అప్పులు అన్ని తీర్చేసాం. కానీ ఒకవేళ మేము అప్పుడు పోలీసులకు దొరికిపోతే మా పరిస్థితి ఏంటి అని చాలా సార్లు ఆలోచించా. మా జీవితంలో జరిగిన ఈ సంఘటననే సినిమాగా చేద్దామని అనుకుంటున్నా” అంటూ చెప్పుకొచ్చాడు. కాగా కోన స్క్రీన్ ప్లే అందించిన వాల్తేరు వీరయ్యలో కూడా చిరంజీవి డ్రగ్స్ డీలర్ గా కనిపించబోతున్నాడు.