Kona Venkat : ఒక్క పూట భోజనం చేసైనా ఉంటా.. అనుకుంటేనే ఇండస్ట్రీకి రండి.. లేకపోతే..

Kona Venkat Shocking Comments on Telugu Industry

Kona Venkat : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో ఎన్నో సినిమాలకి రైటర్ గా చేసిన కోన వెంకట్ ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అందులో యాంకర్ మాట్లాడుతూ.. మీరు ఒక పెద్ద రైటర్.. మీలా రైటర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చే వాళ్లకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అని అడిగితే.. ఇండస్ట్రీకి చాలా మంది ఏదో సాధించేద్దాం అని వస్తారు. చదువులకి సంబంధం లేకూండా నేను రిస్క్ చేస్తా అని ఇండస్ట్రీకి వస్తారు. కానీ ఇండస్ట్రీ అంత ఈజీ కాదు అన్నారు కోన వెంకట్.

ఎన్ని సంవత్సరాలు అయినా పర్వాలేదు. నేను ఏదో ఒకటి సాధిస్తాను. ఒక్క పూట భోజనం చేసైనా సరే ఇక్కడే ఉంటాను అని అనుకునే వాళ్ళు మాత్రమే ఇండస్ట్రీకి రండి. అలాంటి వాళ్ళు మాత్రమే ఇండస్ట్రీలో ఉండగలరు. వాళ్ళు అనుకున్న స్టోరీ బయటికి రావాలి అంటే ఎంతో కష్టపడాలి. వాళ్ళ ట్యాలెంట్ ను ఇండస్ట్రీ , ప్రపంచం ఎప్పుడు గుర్తిస్తుందో ఎవ్వరికీ తెలీదన్నారు కోన వెంకట్.

Also Read : Kona Venkat : ఆ సినిమాలు ఎప్పటికీ బ్లాక్ బస్టర్ అవ్వలేవు.. కోన వెంకట్ వ్యాఖ్యలు

అంతేకాదు కొంతమందికి త్వరగా సక్సెస్ వస్తుంది. కొంతమందికి ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేం. కొంతమందికి పది, పదిహేను సంవత్సరాలు కూడా పట్టొచ్చు అన్నారు. అలా చాలా మంది ఇండస్ట్రీకి వచ్చి పిల్లలు పుట్టినా కూడా ఇప్పటి వరుకు అవకాశాలు లేవు. ఇంత ఓపిక ఉంటే మాత్రమే రండి అంటూ చెప్పుకొచ్చారు కోన వెంకట్.