Kona Venkat : ఆ సినిమాలు ఎప్పటికీ బ్లాక్ బస్టర్ అవ్వలేవు.. కోన వెంకట్ వ్యాఖ్యలు

Kona Venkat : ఆ సినిమాలు ఎప్పటికీ బ్లాక్ బస్టర్ అవ్వలేవు.. కోన వెంకట్ వ్యాఖ్యలు

Those movies can never become blockbusters Kona Venkat comments

Updated On : November 13, 2024 / 4:26 PM IST

Kona Venkat : ప్రముఖ టాలీవుడ్ రైటర్ కోన వెంకట్ ఎన్నో సినిమాలకి రైటర్ గా చేశారు. ఆయన రచయితగా చేసిన చాలా సినిమాలు మంచి సక్సెస్ అయ్యాయి. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈయన కొన్ని సినిమాల స్టోరీ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా కూడా బ్లాక్ బస్టర్ అవ్వలేవని షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఇక ఆ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. ఏదన్న సినిమా గొప్ప సినిమా అవ్వాలంటే.. అందులో కచ్చితంగా ఎమోషన్ ఉండాలి. ఆ ఎమోషన్ దేనిగురించి అయినా అవ్వనివ్వండి.. బ్రదర్ , సిస్టర్, మదర్, ఫాదర్… ఇలా ఏదో ఒక ఎమోషన్ ఉండాలి. ఇలాంటి ఎమోషన్ ఉన్న సినిమాలు కచ్చితంగా జనాలను రెండు గంటలు సీట్ లల్లో కూర్చోబెడుతుంది. కనీసం ఒక్క చిన్న సీన్ అయినా హార్ట్ టచింగ్ గా ఉండాలని అన్నారు.

Also Read : Laapataa Ladies : ఆస్కార్ కోసం సినిమా టైటిల్ నే మార్చేసారుగా..

అలా లేని సినిమాలు హిట్ సినిమాలు అవ్వచ్చు కానీ బ్లాక్ బస్టర్ సినిమాలు ఎప్పటికీ అవ్వలేవు అన్నారు. హిట్ కి బ్లాక్ బస్టర్ కి మధ్య ఉన్న తేడానే ఎమోషన్. అది లేకపోతే ఆ సినిమా ఎవ్వరికీ గుర్తుండదు. ఎమోషన్ తో హిట్ అయిన సినిమాను ఎవ్వరూ మర్చిపోలేరు అంటూ కోన వెంకట్ తెలిపారు.