ఖైదీ నెంబర్ 150 తర్వాత.. స్మాల్ గ్యాప్ తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మళ్లీ స్పీడ్ పెంచాడు. వరుస సినిమాలతో బాస్ ఈజ్ బ్యాక్ అనేందుకు రెడీ అవుతున్నాడు. సైరా షూటింగ్ చివరి దశకి చేరుకోవడంతో చిరూ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టాడు. చిరూ, కొరటాల శివ కాంబోలో తెరకెక్కబోయే అప్ కమింగ్ మూవీ పనులు మొదలవుతున్నాయి. సైరా షూటింగ్ కి స్మాల్ గ్యాప్ రావడంతో ఏప్రిల్ 3 నుంచి 9వ తేదీ వరకు ఐదు రోజుల పాటు చిరూ, కొరటాల సినిమా పనులు జరగనున్నాయి. ఈ గ్యాప్ లోనే మెగాస్టార్ పై ఫోటో షూట్ నిర్వహించనున్నారు.
ఇక కమర్షియల్ ఫార్ములాతో మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు తీయడంలో కొరటాల శివ స్పెషలిస్ట్. ఇప్పటి దాకా కొరటాల డైరెక్షన్ లో వచ్చిన ఏ సినిమా తీసుకున్నా.. అందులో సోషల్ రెస్పాన్సిబిలిటీ కనిపిస్తుంది. ఇప్పుడు మెగాస్టార్ కోసం కూడా ఈ స్టార్ డైరెక్టర్ మరోసారి మెసేజ్ ఓరియెంటెడ్ స్టోరీనే రెడీ చేసినట్లు తెలుస్తోంది. గతంలో చిరూ నటించిన ‘ఠాగూర్’ సినిమాకి కొరటాల డైరెక్ట్ చేయబోయే సినిమాకి దెగ్గరి పోలికలుంటాయని సమాచారం.
పదిహేనేళ్ల క్రితం వచ్చిన ‘ఠాగూర్’లో చిరంజీవి అవినీతిపై పోరాటం చేశాడు. ఇప్పుడు కూడా కరప్షన్‌ను తనదైన స్టైల్ లో ఎండగట్టే విధంగా కొరటాల పవర్‌ఫుల్ సబ్జెక్టును సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు చిరూ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు చిరూ సరసన నటించబోయే హీరోయిన్ కోసం కొరటాల చాలా రోజులుగా సెర్చ్ చేస్తున్నాడు. నయనతార, తమన్నా, అనుష్క పేర్లు వినిపించినా ఇంకా ఎవ్వరూ ఫైనల్ కాలేదు. అంతేకాదు.. సినిమాలో మరో ఇంపార్టెంట్ రోల్ కోసం..శృతి హాసన్ ని సంప్రదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.