Koratala Siva : ఎన్టీఆర్ దేవర 2 పక్కన పెట్టేసిన కొరటాల శివ.. ఆ హీరోకి 25వ సినిమా స్పెషల్ గా చేయబోతున్నాడా?

కొరటాల శివ ప్రస్తుతానికి దేవర 2 ని పక్కన పెట్టేసినట్టి సమాచారం.

Koratala Siva

Koratala Siva : వరుసగా సక్సెస్ లు కొట్టిన దర్శకుడు కొరటాల శివ ఆచార్య సినిమాతో ఫ్లాప్ చూసాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ దేవర సినిమాతో పర్వాలేదనిపించాడు. దేవర సీక్వెల్ కూడా ఉండటంతో నెక్స్ట్ ఎన్టీఆర్ తోనే దేవర 2 చేస్తాడని అంతా అనుకున్నారు. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత దేవర 2 మొదలవ్వాల్సి ఉన్నా ప్రస్తుతానికి వాయిదా వేసాడని సమాచారం. నీల్ సినిమా తర్వాత త్రివిక్రమ్ సినిమా లేదా దాదాసాహెబ్ బయోపిక్ లైన్లోకి వస్తుందని తెలుస్తుంది.

దీంతో కొరటాల శివ ప్రస్తుతానికి దేవర 2 ని పక్కన పెట్టేసినట్టి సమాచారం. తాజాగా కొరటాల శివ నాగచైతన్యకు ఒక కథ వినిపించాడట. చైతన్య కూడా ఇటీవల పలుమార్లు కొరటాల శివను కలిశాడట. చైతన్య ఇటీవల తండేల్ సినిమాతో పెద్ద హిట్ కొట్టాడు. ప్రస్తుతం విరూపాక్ష డైరెక్టర్ తో తన 24వ సినిమా చేస్తున్నాడు . ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.

Also Read : Sowmya : ఒక లాయర్ నాతో మిస్ బిహేవ్ చేసాడు.. వాళ్ళ వైఫ్, అమ్మ పక్కకి వెళ్తే చాలు నా మీద చేతులు వేసి..

ఆ తర్వాత నాగచైతన్య తన 25వ సినిమా స్పెషల్ గా ప్లాన్ చేయాలని అనుకున్నాడు. ఇదే సమయంలో కొరటాల శివ కలిసి కథ చెప్పడంతో ఆ కథ చైతూకి నచ్చిందని, శివ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడని, కొరటాల శివ నాగచైతన్య 25వ సినిమా దర్శకత్వం చేసిన తర్వాత దేవర 2 మొదలుపెడతాడని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.