Koti Honor with Doctorate from KL University
Koti : టాలీవుడ్ ఒకప్పటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ‘కోటి’ అత్యున్నత గౌరవమైన డాక్టరేట్ అందుకున్నాడు. తెలుగు మరియు హిందీ చిత్రాలలో సంగీత దర్శకుడిగా పని చేసిన కోటి.. కెరీర్ మొదటిలో మరో మ్యూజిక్ కంపోజర్ ‘రాజ్’తో కలిసి పని చేశాడు. 1983 నుంచి 1994 వరకు కలిసి పని చేసిన వీరిద్దరూ దాదాపు 180 చిత్రాలకు సంగీతం అందించి ‘రాజ్-కోటి’గా ఒక బ్రాండ్ ని క్రియేట్ చేశారు.
Music Director Koti : విలన్ గా మారిన మ్యూజిక్ డైరెక్టర్.. సెకండ్ ఇన్నింగ్స్ షురూ..?
ఇక 1994 నుంచి ఒంటరిగా కెరీర్ మొదలుపెట్టిన కోటి.. అదే సంవత్సరంలో ‘హలో బ్రదర్’ చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా నంది అవార్డును గెలుచుకున్నాడు. విడిపోయిన తర్వాత నుంచి ఇప్పటివరకు కోటి 350 పైగా సినిమాలకు సంగీతం మరియు నేపథ్య సంగీతాన్ని సమకూరుస్తూ స్వరకోటి అనిపించుకున్నాడు. తెలుగు ఆడియన్స్ కి వెస్ట్రన్ సంగీతాన్ని పరిచయం చేసింది కోటినే.
ప్రముఖ సంగీత దర్శకుడు ‘ఎస్ రాజేశ్వరరావు’ వారసుడిగా కోటి ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. మ్యూజిక్ డైరెక్టర్ కె చక్రవర్తి దగ్గర అసిస్టెంట్‌గా సంగీత జీవితాన్ని మొదలుపెట్టిన కోటి.. గురువుగా ఏ ఆర్ రెహమాన్, మణిశర్మ, హారిస్ జయరాజ్, దేవి శ్రీ ప్రసాద్ మరియు థమన్ వంటి మ్యూజిక్ డైరెక్టర్‌లకు సంగీత పాఠాలు నేర్పాడు. ప్రస్తుతం అడపాదడపా సినిమాలకు సంగీతం అందిస్తున్న కోటి ‘కే ఎల్ యూనివర్సిటీ’ నుండి డాక్టరేట్ పట్టాని అందుకోబోతున్నాడు. ఈ విషయాన్ని సింగర్ కౌశల్య తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది.