‘కౌసల్య కృష్ణమూర్తి’ (ది క్రికెటర్).. నుండి ‘ముద్దబంతి’ వీడియో సాంగ్ రిలీజ్..
ప్రముఖ నటుడు రాజేష్ కుమార్తె, తమిళ్, మలయాళ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేష్.. ‘కౌసల్య కృష్ణమూర్తి’ (ది క్రికెటర్).. సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అయ్యింది.. తమిళనాట సూపర్ హిట్ అయిన ‘కణ’ మూవీకిది అఫీషియల్ రీమేక్. ఇటీవల విడుదలైన ‘కౌసల్య కృష్ణమూర్తి’ పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తుంది.
ఈ సినిమాలో ఐశ్వర్య, ప్రత్యేకపాత్రలో కనిపించిన శివకార్తికేయన్‌ల నటనకు మంచి పేరొచ్చింది. కె.ఎస్.రామారావు సమర్పణలో, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై, కె.ఎ.వల్లభ నిర్మించగా, రీమేక్ సినిమాల స్పెషలిస్ట్ భీమనేని శ్రీనివాసరావు డైరెక్ట్ చేశాడు. రీసెంట్‌గా ఈ సినిమా నుండి ‘ముద్దబంతి’ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఐశ్వర్య పుష్పాలంకరణ సందర్భంలో ఈ పాట వస్తుంది.
Read Also : శిబిరాజ్ ‘రంగ’ – టీజర్..
సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన యువతి అంతర్జాతీయ క్రికెటర్ కావాలనే లక్ష్యాన్ని ఎలా చేరుకుంది? అనే పాయింట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. కెమెరా : ఐ. ఆండ్రూ, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర రావు, సంగీతం : ధిబు నినన్ థామస్, కథ : అరుణ్ రాజా కామరాజ్, డైలాగ్స్ : హనుమాన్ చౌదరి, ఆర్ట్ : ఎస్ శివయ్య.