Kraven The Hunter : విడుదలకి రెడీ అయిన క్రావెన్: ది హంటర్..ఎప్పుడంటే..

హాలీవుడ్ నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా క్రావెన్: ది హంటర్.

Kraven The Hunter : విడుదలకి రెడీ అయిన క్రావెన్: ది హంటర్..ఎప్పుడంటే..

Kraven The Hunter movie is ready to release

Updated On : December 17, 2024 / 6:47 PM IST

Kraven The Hunter : హాలీవుడ్ నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా క్రావెన్: ది హంటర్. ఈ సినిమా విడుదలకి మరో రెండు వారాల సమయం ఉంది. సోనీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను డైరెక్టర్ చందూర్ తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ సినిమా విడుదల దగ్గర పడడం అలాగే.. దీనికి ఆర్ రేటింగ్ రావడంతో మీడియాతో ముచ్చటించారు డైరెక్టర్ చందూర్.

ఇక మీడియాతో ఆయన మాట్లాడుతూ.. “ఈ చిత్రానికి ఆర్ రేటింగ్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ రేటింగ్ తో దీనికి నేను పూర్తి న్యాయం చేసానని భావిస్తున్నాను. క్రావెన్ కథని అత్యద్భుతంగా చెప్పడం చాలా అవసరం అని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఈ సినిమా కథ గురించి చెప్తూ..కోపం, ఆవేశంతో సెర్గీ ఇద్దరు పిల్లలని టీనేజ్ లో చంపేస్తాడు. దాని నుండి తప్పించుకునే అవకాశం ఉన్నపటికీ అలా చెయ్యడు. దానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణమే ఈ సినిమాకి కీ పాయింట్ అని ఆయన పేర్కొన్నారు.

Also Read : Funky Movie : సినిమాల్లో నటించాలి అనుకుంటున్నారా.. అయితే ఇది మీ కోసమే.. విశ్వక్ సినిమాలో నటించే ఛాన్స్..

ఇక చందూర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో అరియానా డీ బోస్, ఫ్రెడ్ హెచ్చింగర్, అలెసాండ్రో నీవోలా, క్రిస్టోఫర్ అబ్బాట్, రస్సెల్ క్రౌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.జనవరి 1 న ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో క్రావెన్: ది హంటర్ విడుదల కావడానికి రెడీ గా ఉంది.